ఎ‘జెండా’పై ‘కసి’ రాజు
కిసాన్ ప్రదర్శనలో, లోక్‌సభలో మాట్లాడిన రాహుల్‌లో కసి ఉన్న రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో చెప్పుకుంటున్నారట.
బాల్యం నుంచి జెడ్ ప్లస్ కేటగరీ భద్రతా వలయంలో జీవించిన వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుందో, అతని గుం డెల్లో గూడుకట్టుకొని ఎన్ని భయాలు ఉంటాయో, ఎన్ని సందేహాలు మన స్సుని మెలిపెడుతూ ఉంటాయో ఊహించుకోవలసిందే. ఇందిరాగాం ధీ హత్యానంతరం అంత్యక్రియలు చేయడానికి ముందే రాజీవ్ ప్రధాని పదవీ బాధ్య తలు స్వీకరించినప్పుడు ‘మనకిప్పుడు ఈ పదవి అవసరమా?’ అంటూ భర్తని దిగులుగా ప్రశ్నించా రు సోనియా గాంధీ. అంగరక్షకులు పేల్చిన తూటా లకు గాయపడిన నాయనమ్మ పావురం లాగా నేల కొరిగిన దృశ్యం, తమిళ ఉగ్రవాది మానవబాంబై వచ్చి తండ్రిని పేల్చివేసిన సన్నివేశం రాహుల్‌ను అనుక్షణం వెంటాడి వేధిస్తూనే ఉంది. అయినా రాహుల్ ముందు పీటీలో నిలిచి రాజకీయం నడి పించాలనీ, ఖడ్గచాలనం చేయాలనీ చెబుతూ ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నిస్తున్న హితైషు లకు అతగాడి హృదయంలో విస్ఫోటనాల వైనం తెలియదు. మన్మోహన్‌సింగ్ ఎన్నిసార్లు ఆహ్వానిం చినా పదవీగండం నుంచి తప్పించుకోవాలనే మం త్రి మండలిలో ససేమిరా చేరనన్నాడు రాహుల్. ‘ప్రియాంక లావో, పార్టీ బచావో’ అంటూ కొంత మంది వీర కాంగ్రెస్‌వాదులు నినాదాలు చేసినప్ప టికీ రాజకీయ వారసత్వం రాహుల్‌కే దక్కాలన్నది సోనియా నిర్ణయం. లండన్‌లో ఉన్న కాలంలో ప్రేమించిన పొడుగుకాళ్ల సుందరి వెనోరిక్‌ను వివా హం చేసుకుందామంటే రాజకీయం అడ్డువచ్చింది.
ఆమ్మ ఔననలేదు. భారతీయురాలిని పెళ్లి చేసు కుంటే (రాజకీయంగా) బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సలహా నచ్చలేదు. చివరికి పెళ్లీ పెటాకులూ లేకుండా రాజకీయాల తోనే కాపురం చేయాలని తీర్మానిం చుకున్న రాహుల్ తనదైన శైలిలో సంస్థాగత ప్రజాస్వామ్య విలువలు పున రుద్ధరించే పని పెట్టుకున్నారు. కానీ ముందుకు సాగలేకపోయారు. ఎన్ని కలలో మనస్ఫూర్తిగా పోరాడినప్ప టికీ విజయం ఇంకా వరించవలసే ఉన్నది. ఈ మధ్య రెండు నెలలు బర్మాలోనో, మరె క్కడో విపాసనో మరేదో చేసి కాస్త తేరుకొని వచ్చిన రాహుల్ సరికొత్త ప్రణాళిక ప్రకారం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. కేదార్‌నాథ్ చేరుకోవడానికి 16 కిలోమీటర్లు నడిచి వెళ్లడం వెనుకా రాజకీయం ఉంది. హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించడం సర్వమత సమభావానికీ, మతసామరస్యానికీ నిదర్శనం. అయోధ్యలో తాళాలు తీయడాన్ని రాజీవ్ అనుమతించడాన్ని ఉదార హిందూవా దంగా అభివర్ణించిన విశ్లేషకులు రాహుల్ తీర్థయా త్రనూ అట్లాగే అన్వయిస్తారు. నరేంద్రమోదీ ముస్లిం ముల్లాలతో, క్రైస్తవ బిషప్పులతో కలసి ఫొటోలు దిగుతున్నట్టే రాహుల్ హిందూమతానికి తాను వ్యతిరేకం కాదని నిరూపించుకోవడం భార తదేశంలో రాజకీయాలలో నెగ్గుకురావడానికి అత్య వసరం. రాహుల్ క్రమంగా దారికొస్తున్నాడు. మం కుపట్టు వీడుతున్నాడు. పట్టువిడుపులు నేర్చుకుం టున్నాడు. కిసాన్ ప్రదర్శనలో, లోక్‌సభలో మాట్లా డిన రాహుల్‌లో కసి ఉన్న రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో చెప్పుకుంటున్నారట. కాంగ్రెస్‌వా దుల నిరీక్షణ ముగిసింది. అధినాయకుడు ద్విగుణీ కృతమైన ఉత్సాహంతో తిరిగి వచ్చాడు. కాంగ్రెస్ లో రాహుల్ హయాం ప్రారంభం కాబోతున్నది.
క్రీడి
ఎక్స్‌రే