తెలంగాణ భాషా కేతనం ఎగరాలి | Telangana language Banner flying in telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణ భాషా కేతనం ఎగరాలి

Published Thu, Dec 11 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

తెలంగాణ భాషా కేతనం ఎగరాలి

తెలంగాణ భాషా కేతనం ఎగరాలి

తెలుగు భాషకు విశిష్ట భాషా హోదా లభించింది. అంతలోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. అటు సంస్కృతం ఇటు ఆంగ్లం దేశభాషల మీద సవారీ చేస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భాషా భవిష్యత్తు ఏమిటో, ఎలా ఉంటుందో తెలియకున్నది. విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోకి చేజారిపోతున్నది. ఇంజనీరిం గ్, వైద్య విద్య మినహా మిగతా పెద్ద బడుల (విశ్వవిద్యాలయాల)లో తెలుగులో పీజీని చదివే, రాసే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ కళా శాలలు, విద్యాసంస్థలు అందుకు ప్రోత్సహించ డం లేదు. తెలుగులో నేర్పడం, నేర్వడం చిన్న తనమైంది. దీంతో తెలుగు భాష బోధన పరం గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. దీని కి తోడుగా తెలంగాణలో వలస తెలుగు ప్రభావం ఎక్కువై అసలు తెలంగాణ భాషకు అన్యా యం జరుగుతున్నది. అందువల్లే ప్రత్యేక రా ష్ట్రం డిమాండ్‌కు భాషకూడా ఒక కారణమైంది.
 
 ఐతే తెలంగాణ భాష స్వరూపం, స్వభా వం ఏమిటి? దానిని ఎలా రూపొందించాలి? పాలన, బోధన, పాత్రి కేయ రంగాలలో దానికి సముచిత స్థానం ఇవ్వ డం ఎలా? ఒక సమాన రూపం ఏర్పరచగల మా? ఏర్పరిస్తే దాని స్వ రూపం ఏమిటి? ఎలా ఉండాలి? ఉంటుంది? అనే అంశాలను చర్చించుకోవడం అవసరం. పాలన, బోధన, రచన, న్యాయ వ్యవస్థలలో తెలంగాణ భాషని ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. ప్రాథమిక పాఠశాల పాఠ్య పుస్తకాలు, వాచ కాలు ఆయా పరిసరాలకు, ప్రాంతాలకు, భాషలకు విడి విడిగా వేయాలి. వాచక ప్రచురణ కేంద్రీకరణని దెబ్బకొట్టాలి. వివిధ జిల్లాలకు పాఠ్యపుస్తకా లను తయారు చేసుకునే వెసులుబాటు కలిగించాలి. పరభాషల ప్రభావం నుండి బయటపడాలి. ముఖ్యంగా గొట్టు పదాలైన సంస్కృత పదాలను వీలైనంతవరకు పరిహ రించాలి. ప్రాథమిక విద్యను ఆదివాసులకు ఆయా భాషలలో, ఇత రులకు తెలుగులో బోధించాలి.
 
 తెలంగాణ భాషకు ఒక సమగ్ర నిఘం టువు అవసరం. అందులో వివిధ ప్రాంతాల, జిల్లాల పదాలు, ప్రాచీన, ఆధునిక పదాలు రావాలి. ఇతర భాషల పదజాలం తప్పనిసరి. వృత్తుల, శ్రమ సంబంధాల భాష ప్రధానంగా చేరాలి. సుమారు రెండున్నర లక్షల పదాలతో సమగ్ర నిఘంటువు జరూరుగా తయారు చేయ వలసి ఉంది. అప్పుడే తెలంగాణ భాష విశ్వ రూపం తెలియవస్తుంది. ఈ నిఘంటువులో తెలంగాణ భాషకు మూలమైన కోయ, గోండి ఇత్యాది ఆదివాసీ భాషలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వివిధ ప్రాకృత భాషల నిలయంగా తెలంగాణ తెలుగు ఎన్నో పదాలను ఇచ్చింది. మరికొన్ని పదాలను గ్రహించి తనలో సంలీనం చేసుకున్నది. తెలంగాణ ఉపకులాల కేంద్రం. సుమారు 150 ఉపకులాలలో 100 కులాలకి ప్రత్యేక భాష ఉంది. ఒక్కో కులానికి సంకేత భాష, ప్రత్యేక పదజాలం ఉన్నాయి.
 
 వాటిని ఈ నిఘంటువులో చేర్చాలి. ఆర్థిక హార్ధిక సహకా రం ఉంటే రెండేళ్లలో మెగా డిక్షనరీని తయారు చేయవచ్చు. తెలంగాణ బహుభాషల నిలయం. ఎన్నో భాషల పదాలు ఇక్కడ సజీవంగా ఉన్నా యి. అంతరించిపోతున్న వృత్తులు, పనులు, వైద్య, విజ్ఞాన ధారల పదజాలం విలక్షణమై నది. ఇందుకోసం ఒక పద సేకరణ విభాగం అవసరం. కొత్త పదాల రూపకల్పన కోసం నూతన పద పరికల్పన కమిటీని ఎంపిక చేయా లి. తిరిపమెత్తి అయినా తెలంగాణ భాష ఔన్న త్యకేతనాన్ని ఎగరవేయడం తల్లి తెలంగాణకు కీర్తి కిరీటమే అవుతుంది. అది అందరి బాధ్యత. సమష్టిగా ఆలోచిద్దాం. నిర్మాణాత్మకంగా తెలం గాణ భాషా కేంద్రం ఏర్పాటు చేద్దాం.    
 (వ్యాసకర్త తెలంగాణ రచయితల
 వేదిక అధ్యక్షులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement