ఆంధ్రప్రదేశ్ సహా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు ప్రజలు మనస్తాపానికి గురైన రోజు... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రక టించిన రోజు. తద్వారా వచ్చే పరిణామాలను అంచనా వేయ కుండా, అనాలోచితంగా, అన్యా యంగా, నిర్దాక్షిణ్యంగా రాజ కీయ లబ్ధి కోసమే కేంద్రం ఆ ప్రకటన చేసింది. రాజకీయంగా ఇతర పార్టీలను దెబ్బ తీయాలన్న కాంగ్రెస్ ఢిల్లీ సుల్తానుల పన్నాగానికి తెలుగు వారు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు బీజం పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింహావలోకనం చేసుకుంటే ప్రస్తుతం తెలుగు ప్రజలపై ఎంతటి ప్రాణాంతక కుట్ర జరుగు తున్నదో తెలుస్తుంది.
అందరి అభీష్టంతోనే...
1913లో బాపట్ల నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆంధ్ర మహాసభ ఉద్యమం మలుపులు తిరుగుతూ, ఎన్నో ప్రాణ త్యాగాలతో 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణను సాధ్యం చేసింది.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో అటు ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఇటు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల్లో 2/3 వంతు సభ్యులు ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గారు. కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి కొంత మంది విభజన వాదం వినిపించినా, తొలి ప్రధాని జవ హర్‌లాల్ నెహ్రూ కలుగజేసుకొని సమన్వయపరిచారు. దానితో వారు కూడా సమైక్య రాష్ట్రానికి అనుకూలుర య్యారు. అయితే 1957లో జరిగిన ఎన్నికలలో విభజన వాదులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. అటుపై 1968వ సంవత్సరం వరకు ఎటువంటి ఉద్యమాలు, ఆం దోళనలు జరగలేదు. కనీసం బంద్ పిలుపులు కూడా లేవు. ఒక ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు.
సానుకూల కోణం ఏదీ?
1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కేవలం 10 నెలలు ఉద్యమం జరిగింది. అనంతరం 2000వ సంవత్సరం వరకు తెలంగాణ ఊసే లేదు. నిరాశా, నిస్పృహలతో ఉన్న కొంత మంది నాయకుల ద్వారా మాత్రమే తెలంగాణ డిమాండ్ ఊపిరి పోసుకుంటున్నది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు 2000- 2001 సంవత్సరాలలో మంత్రి పదవి ఇవ్వని ఒకే ఒక కారణంతో కేసీఆర్ తన అసంతృప్తి నుంచి మళ్లీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
వైఎస్ హయాంలో...
2004 నుంచి 2009 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అన్ని ప్రాంతాలలో పరిస్థితులను పూర్తిగా అదుపులో ఉంచారు. ఆయన బతికి ఉన్నంత కాలం ప్రత్యేక తెలంగాణ అంటూ ఎవరూ మాట్లా డలేదు. అయితే వైఎస్ సాధించిన అపూర్వ విజయాలను ఆయన మరణించిన నాలుగేళ్లలోనే నిష్క్రియాపరత్వానికి మారు పేరుగా మారిన మన పరిపాలనా యంత్రాంగం నిష్ఫలం చేయగలిగింది. మానని గాయాలను మాన్పిం చిన మన కాలపు ధన్వంతరి డాక్టర్ వైఎస్. వైఎస్ రాజకీయ వైద్యశాలలో చికిత్సకు అవకాశం లేని మొండివ్యాధి లేనే లేదని రుజువైంది. కేంద్రం తెలంగాణ విషయంలో నిర్ణ యం తీసు కోవాలని చెప్పిన సందర్భంలో కూడా ఆయన నిర్ద్వంద్వంగా, నిర్దిష్టంగా తన నిర్ణయాన్ని ప్రజల ఆకాం క్షను ఢిల్లీ పెద్దలకు నయాన భయాన చెప్పి ఒప్పించార నడం నిర్వివాదాంశం.
వైఎస్ మరణానంతరం పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. ఎటువంటి ఒత్తిడులు లేకపోయినా 2009 డిసెం బర్ 9 రాత్రి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తరఫున చిదంబరం చేసిన తెలంగాణ ప్రకటన తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని గంటల వ్యవధిలో సమై క్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి, ఉగ్రరూపం దాల్చ డంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజనకు నిశ్శబ్దంగా పావులు కదుపుతూనే ఉంది. ఫలితంగా ఇప్పు డు మరోసారి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ సుల్తానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తెగించారు.
గతంలో 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన సమ యంలో అన్ని పార్టీల నాయకులు తిరగబడటంతో కేంద్రం వెనక్కితగ్గింది. ఈసారి వ్యూహాత్మకంగా వివిధ పార్టీల నాయకులు తిరగబడలేని విధంగా అదనుచూసి దెబ్బ కొట్టింది కాంగ్రెస్. కాని అనూహ్యంగా ఈసారి తెలుగు ప్రజలే అప్రతిహతంగా మహోగ్ర ఉద్యమాన్ని అత్యంత శాంతియుతంగా నిర్వహిస్తున్నారు.
గాంధీ మార్గంలోనే...
నిజానికి ప్రజాస్వామిక పోరాటాల శక్తి ప్రజల సంకల్ప బలంలో ఉంది. విభజన ప్రకటనతో తెలుగు ప్రజలు ఐక్యంగా గాంధీ చూపిన మార్గంలో ఉద్యమిస్తున్నారు. అన్ని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవా దులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆటోమొబైల్ సంఘాలు ఇంకా ఎన్నో సంఘాలు ఐకమత్యంతో గాంధీ చూపిన శాంతి మార్గంలో నడుస్తున్నందుకు ఈ సందర్భంగా అందరినీ పేరు పేరునా అభినందించాల్సిందే.
ఢిల్లీ మెడలు వంచాలి...
ఇప్పటి వరకూ జరుగు తున్న పరిణామాలు తెలుగుజాతికి తగిలిన ‘ఎదురు దెబ్బలే’. కాని ఓటమి కాదు. ఇక ముం దు కూడా సహాయ నిరాకరణ, శాంతి, సంయమనం పాటిస్తూ పోరు సల్పితే అతి త్వరలో విజయం ఖాయం. ఢిల్లీ సుల్తానుల మెడలు వంచి అనుకున్నది సాధిద్దాం. అదే జరిగితే భారతదేశం మొత్తం తెలుగు జాతికి రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇకముందు భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని అన్యాయంగా, అనాలోచితంగా విభజించడానికి కాంగ్రెస్ ఢిల్లీ సుల్తానులు సాహసించరు. రాజకీయ రంగం లోనే కాదు, ఏ రంగంలోై నెనా సంకల్పబలం ప్రధానం. ప్రజల మహాసంకల్పం ముందు ఏదీ నిలబడదు. తెలం గాణ విషయంలో కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కూడా అంతే. కేంద్రాలు, రాష్ట్రాలు కాదు. ప్రజలే అంతిమ నిర్ణాయక శక్తులు. తెలంగాణ రాష్ట్రం అనేది మెజారిటీ ప్రజల తీర్పు కాదు.
-అడుసుమిల్లి జయప్రకాష్,
మాజీ శాసన సభ్యులు