ఆ మహత్తర విప్లవానికి 98 ఏళ్లు
సందర్భం
ఒకనాటి సోవియట్ యూనియన్ ఒక దేశంగా నేటికీ మనుగడసా గిస్తూ ఉండి ఉన్నట్ల యితే ఈ 7వ తేదీని ప్రపంచంలో మార్క్సిస్టు సిద్ధాంతం ఆలంబనగా ఏర్పడిన తొలి సోషలిస్టు రాజ్య 98వ వార్షికోత్సవ వేడుకగా యావత్ ప్రపంచంలోని శ్రమజీవులూ, తదితర పీడితులూ ఆనందోత్సాహాలతో జరుపు కుని ఉండేవారు! 70 సంవత్సరాలకుపైగా ఆ సోష లిస్టు సోవియట్ యూనియన్ అక్కడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన అంతవరకూ, ప్రపంచం ఎరుగని ప్రత్యామ్నాయ ప్రజాపాలనను సాగించింది.
1. తమ ప్రజలందరికీ జీవన భద్రత, సామాజిక న్యాయం అందించింది.
2. తమ దేశ మహిళా లోకానికి గుణాత్మకంగా ఎన్నదగిన సామాజిక స్వేచ్ఛను, సమాన హక్కులను, ప్రత్యేక గౌరవాలను కల్పిం చింది.
3. ప్రజలలో ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ అస మానతలను కనిష్ట స్థాయికి కుదించే కృషి చేసింది.
4. అంతర్జాతీయంగా విముక్తి పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచింది.
5. నూతనంగా స్వాతంత్య్రం పొందిన మన దేశం వంటి దేశాలు తిరిగి వెనువెంటనే సామ్రాజ్యవాద కబంధ హస్తాలలో చిక్కుకో కుండా సోవియట్ యూనియన్ అందించిన నిస్వార్థ సహాయం నిరుపమానమైనది.
6. హిట్లర్ ఫాసిజాన్ని ఓడించడంలో ప్రధాన భూమిక ధరించింది సోవియట్ యూని యన్.
7. సామ్రాజ్యవాదాన్ని నిలువరిస్తూ - ప్రపంచ శాంతికి పెట్టని కోటలా నిలిచింది.
8. ఆ తర్వాత సోషలిస్టు సమాజాలుగా ఏర్పడిన చైనా తదితర దేశాల ఉనికి, మనుగడను సోవియట్ సహకారం
లేకుండా ఊహిం చలేం!
అలాంటి సోవియట్ యూనియన్ ప్రపంచ పీడిత, తాడిత ప్రజలకు విషాదాన్నీ... సామ్రాజ్య వాద, దోపిడీ శక్తులకు ఆనందాన్నీ కలిగించే రీతిలో తన సోషలిస్టు వ్యవస్థను కోల్పోవడమే గాక, ప్రపంచ చిత్రపటం నుండి అంతరించింది. ఇందుకు అప్పటి బహిర్గత భౌతికవాస్తవ పరిస్థి తులు ఏమిటి? సోవియట్ యూనియన్ అంతర్గత పరిస్థితి ఏమిటి? ఈ విశ్లేషణ ఈ వ్యాస పరిధిలో లేదు. కానీ ఈ పరిస్థితి స్టాలిన్, కృశ్చేవ్, గోర్బచేవ్, ఇత్యాదుల తప్పిదాల వలననే జరిగిందని చెప్ప బూనడం మార్క్సిజం రీత్యానే సరైంది కాదు.
చరిత్రలో వ్యక్తుల పాత్రను తక్కువ అంచనా వేయ కపోయినా నిర్ణయాత్మక శక్తి అని మాత్రం చెప్ప లేము. తన భౌతిక పరిస్థితి దృష్ట్యా చరిత్ర అందుకు అనువైన నేతలను సృష్టించుకుంటుంది. మార్క్స్ కాకపోతే మరొకరు కొంచెం ఆలస్యంగా నైనా అదనపు విలువ శాస్త్రీయ అవగాహనతో కూడిన మానవ పరిణామ చరిత్రగా గతితార్కిక భౌతిక వాదాన్ని తప్పక ప్రతిపాదించి ఉండేవారని స్వయంగా ఏంగిల్స్ అన్నారు. ఇక చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్థ తిరిగి రూపుదిద్దుకుంటున్నదనీ, తదనుగుణమైన రాజ్య వ్యవస్థ ఏర్పడటమే మిగిలి ఉందనీ భావించే ఆస్కారం నేడున్నది.
వియత్నాం, క్యూబాలు సైతం తమ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూప గల సంస్కరణలను చేపట్టాయి. తూర్పు జర్మనీతో సహా తూర్పు యూరప్ రాజ్యాలలో సోషలిస్టు వ్యవస్థ మిగలలేదు. సోషలిజం విఫలమయిందనీ, దానితో మార్క్సిజం కూడా తన సైద్ధాంతిక వాస్త వితకను కోల్పోయిందనీ, పెట్టుబడిదారీ విధా నమే శాశ్వతమనీ ప్రచారం చేస్తూ సంబరపడే సామ్రాజ్యవాద దోపిడీ శక్తులు కోకొల్లలు.
పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గానికి పరాకాష్ట అయిన సామ్రాజ్యవాద దశకు చేరుకున్నాం. అయినా, సర్వం దాసోహం అని, ప్రపంచ మాన వాళి, దాని పాదాల ముందు మోకరిల్లకుండా దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాం. ప్రస్తు తం ఇంకా మానవాళి పురోగమనానికి ఆ ప్రయా ణం దోపిడీ, అణచివేత రహిత వ్యవస్థకు చేరుకోక పోవచ్చు. అందుకు ఇంకా చాలా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఆ దిశ మాత్రం అదేనని సూచించే మైలురాళ్లే - నాటి పారిస్ కమ్యూన్‌గానీ, ఆ తదు పరి వచ్చిన సోషలిస్టు సమాజాలు గానీ! అప్పుడే సోషలిజం స్థిరపడింది అని అర్థం కాదు.
ఆ సోష లిస్టు వ్యవస్థ ఇలా ఉంటుంది అని ప్రజలు గ్రహిం చగలిగే సూచికలు మాత్రమే అని. వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తూ, వ్యక్తి తన శక్తి కొద్దీ స్వచ్ఛందంగా కృషి చేసి తనకు అవసరమైన భౌతిక ఆధ్యాత్మిక సంప దను అనుభవించగల వ్యవస్థకు జన్మనిచ్చే క్రమంలో పుడమి తల్లి పడుతున్న పురిటి నొప్పుల కవి చిహ్నాలు! ఎందుకు సోషలిజం విఫలమ యింది? అన్న ప్రశ్నకు అర్థం లేదు. అదొక వ్యవస్థీ కృతమైన సమాజంగా
ఏర్పడితేగదా విఫలమవడానికి?
మార్క్స్ మరణానంతరం ఏంగిల్స్ ‘నేనూ, మార్క్స్ రాసిన రచనలన్నింటినీ తిరిగి పరిశీలనా త్మకంగా చదివాను. మా ప్రతిపాదనలలో అక్షరం కూడా మార్సాల్సిన అవసరం లేదు. కాకుంటే అదేదో నేడో రేపో సంభవించనున్నదన్నట్లు భావించిన మా యవ్వనోద్రేకానికి మాత్రం తనివి తీరా నవ్వుకున్నాను’ అని రాశారు. లక్షల సంవత్స రాల మానవ పరిణామ క్రమంలో మార్క్సిజం అవతరించిన (కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ఆరంభం అనుకుంటే) ఈ 175 సంవత్సరాలు ఎంత? సోష లిజం సోవియట్ యూనియన్ ఆవిర్భవించిం దనుకున్న ఈ 98 సంవత్సరాలు ఎంత? ఆ సోష లిస్టు దశ నుండి కమ్యూనిస్టు దశకు చేరబోతు న్నామని బ్రెజ్నేవ్ సోవియట్ యూనియన్ గురించి ప్రకటిస్తే దాన్ని ఎంత పసితనంగా భావించాలి.
ఏది ఏమైనా ముందుగా చెప్పుకున్నట్లు ఆ 70 సంవత్సరాల మనుగడలో సోషలిస్టు వ్యవస్థ శ్రమజీవులు, పీడితులకు ఒక గుణాత్మకమైన మెరుగైన జీవితాన్ని తానెంత స్థాయిలో ప్రసాదిం చగలను అనే విషయాన్ని ప్రజల ముందుంచింది. సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ఆ దిశగా ప్రజలు పోరాడేందుకు ఒక భౌతిక చిత్రణను, ఆశను, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ఆ సోవి యట్ పుణ్యానే నేడు ప్రపంచ వ్యాపితంగా ప్రజా నీకాన్ని ఆ మార్గంలో పయనింప చేసే కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులొచ్చాయి. మార్క్సిజం ప్రస్తావన లేకుండా నేడు చరిత్రను, మానవ చరిత్రను అధ్యయనం చేయలేరనడం అతిశయోక్తి కాదు. అందుకే మార్క్సిజం నేటికీ ఆచరణాత్మ కమైన సజీవ సిద్ధాంతమే.
మన దేశంలోని పరిస్థితులన్నింటిపైనా కమ్యూనిస్టు ఉద్యమం నిజాయితీగా ఆత్మపరిశీ లనా దృష్టితో మేధోమథనం జరపాలి! నిరాశాజన కంగా నేటి కమ్యూనిస్టు ఉద్యమ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుగా కమ్యూనిస్టులలో ఐక్యత సాధిం చాలి! మార్క్స్ చెప్పిన దాన్ని మరో మాటల్లో చెప్పాలంటే కమ్యూనిస్టుల అపజయ కారణం వారి అనైక్యతలోనే ఉన్నది. అలాగే మన దేశంలో కష్టజీవులు గ్రామీణ పేదల రైతాంగ ఐక్యతతో పాటు చాలా బలంగా, శతాబ్దాల తరబడి వేళ్లూను కున్న మనుస్మృతి భావజాల పరిధిలోని నిచ్చెన మెట్ల లాంటి కులవ్యవస్థలో అణచివేయబడు తున్న దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారి టీలు, ఇతర వెనుకబడిన కులాల వారు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ఈ ప్రజా సమూహాన్ని కూడా తనలో ఇముడ్చుకోవాలి.
అస్తిత్వ ఉద్య మాలు శ్రామిక వర్గ ఐక్యతకు భంగం కలిగిస్తా యని, వాటిపట్ల విముఖత కూడదు. వర్గవైరుధ్యం గుర్తించడానికి ముందే వర్గ వైరుధ్య తీవ్రతను గమ నించి వ్యతిరేకించిన గౌతమ బుద్ధుడి బోధనలు ప్రభవిల్లిన చోట, ఆ రెండు రూపాల దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనకుండా శ్రామిక వర్గ విప్లవం జయప్రదం కాదు. నూటికి పదిమందికి మించని దోపిడీ, దుర్మార్గ శక్తులకు వ్యతిరేకంగా మిగిలిన 90 శాతం మందిని తనలో ఇముడ్చుకోగల విశాల ఐక్య ప్రజాపోరాటాలను, ప్రజల సమస్యలపై ఐక్యమైన కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించాలి. ఆ ఉద్యమమే మన దేశ ప్రజల అభ్యున్నతికే కాక, తమ పునరుజ్జీ వనానికి కూడా ప్రాణప్రదమన్న స్పృహతో కమ్యూ నిస్టు ఉద్యమం పూర్వవైభవాన్ని పొందాలని ఆశిద్దాం..
డా॥ఏపీ విఠల్ (నేడు రష్యన్ విప్లవం 98వ వార్షికోత్సవం సందర్భంగా...)
వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్: 98480 69720