USSR
-
గోర్బచెవ్కు నిరాడంబరంగా తుదివీడ్కోలు
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91) మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె ఇరినా. అనారోగ్యంతో మంగళవారం మరణించిన గోర్బచెవ్ అంత్యక్రియలు శనివారం మాస్కోలో నిరాడంబరంగా ముగిశాయి. భార్య రైసా సమాధి పక్కనే ఆయన పార్థివ దేహాన్ని ఖననంచేశారు. అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు రష్యా పౌరులు భారీగా పోటెత్తారు. అంత్యక్రియల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొనలేదు. సోవియట్ కుప్పకూలడానికి గోర్బచెవే కారకుడనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను పాల్గొనాల్సి వస్తుందనే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదని కూడా చెబుతున్నారు. -
ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్
‘‘మార్క్స్ తదనంతరం విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి వి.ఐ. లెనిన్’’ అంటూ 1924లో ఆనాటి హంగేరియన్ తాత్విక వేత్త జార్జి లూకాస్ వ్యాఖ్యానించారు. అలాంటి లెనిన్ పేరు నేడు కొంత తక్కువగా వినిపిస్తుండవచ్చు. ప్రపంచ కార్మికలోకపు వేగుచుక్క లెనిన్ పేరుని స్మరించుకోవడానికి కూడా కొందరు భయపడి ఉండవచ్చు. లేదా కొందరు కావాలనే ఆతని పేరుని మరుగుపర్చే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు. కానీ 20వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని, కోటానుకోట్ల మానవ మెదళ్ళను కదిలించిన, అనంత జనసమూహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసిన పేరు ఇది. 1917లో జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై, అక్టోబర్ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో అగుపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్. 151 సంవత్సరాల క్రితం.. 1870, ఏప్రిల్ 22న రష్యాలోని సింబిర్క్స్‌లో లెనిన్ జన్మించారు. ఆయన పూర్తిపేరు వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనోవ్ లెనిన్. ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి, ఆయనకు 1887లోనే ఉరిశిక్ష విధించారు. లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం వల్ల 1897లో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ను బహిష్కరించి, సైబీరియాకి పంపించి వేశారు. ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమొక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బోల్షివిక్ గ్రూప్‌నకు వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఆ తర్వాత లెనిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల 1917లో జార్ చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ సోషలిస్టు రిపబ్లిక్కు చైర్మన్‌గా ఎన్నికై, 1924లో తుది శ్వాస విడిచేవరకు కొనసాగారు. ఆయన నాయకత్వం, ఆయన రచనలు, విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించిన ఆయన సారథ్యం ఆనాడు యావత్ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి. ఆయన తాత్విక భూమికకు ఆయన రచనలు సాక్ష్యాలు. ముఖ్యంగా రాజ్యం–విప్లవం, కమ్యూనిజం–ఒక బాలారిష్టం, ఒక అడుగు ముందుకు-రెండడుగులు వెనక్కి, సామ్రాజ్యవాదం-పెట్టుబడి దారి విధానపు అత్యున్నత దశ, లాంటి రచనలు ఆనాటి ప్రపంచ కార్మికోద్యమ, ప్రజాస్వామిక, విప్లవోద్యమకారులకు దారిచూపే దివిటీలయ్యాయి. ముఖ్యంగా ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే రచన ఈనాటికీ ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాలలో అత్యంత అరుదైన రచన. ఆ పుస్తకంలో లెనిన్ ఆనాడు రష్యాలోని పెట్టుబడిదారీ పద్ధతులను, యూరప్‌లో జరుగుతున్న పెట్టుబడిదారీ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆనాటి సామ్రాజ్యవాద దశను నిర్వచించడానికి ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు. అందులో మొదటిది, ఉత్పత్తిని, పెట్టుబడిని కేంద్రీకృతం చేసే గుత్త సంస్థలను రూపొందించడం, రెండవది, బ్యాంకుల పెట్టుబడిని, పారిశ్రామిక పెట్టుబడులను కలిపివేసి ఫైనాన్షియల్ పెట్టుబడిని తయారుచేయడం, మూడవది, అంతకు ముందు ఎగుమతిచేసే వస్తువులతో పాటు, పెట్టుబడిని ఎగుమతి చేసే విధానాలను మొదలు పెట్టడం, నాలుగవది, అప్పటికే ఏర్పడిన ప్రపంచ పెట్టుబడి గుత్త సంస్థలు భౌగోళికంగా తమలో తాము విభజించుకోవడం, అయిదవది పెట్టుబడి శక్తులు ప్రాంతాల వారీగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం. ఈ అయిదు అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రపంచ వ్యాపితం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ పుస్తకాన్ని 1916లో లెనిన్ రాశారు. అంటే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు సామ్రాజ్యవాదం రూపు మార్చుకొని ప్రపంచీకరణ అవతారం ఎత్తింది. ఆయా దేశాల్లోని పాలక వర్గాలను తమ అనుచరులుగా మార్చుకొని, ఆ దేశాలలోని ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలను, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో తయారు చేసిన వస్తు సముదాయం మత్తులో ముంచి వేసి, ఎన్నటికీ బయటపడే వీలులేని, ఆర్థికచట్ర వలయంలోకి తోసివేసి, అంతర్జాతీయ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఇప్పుడు మనమంతా ఆ మాయాజాలంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాం. 1917లో రష్యాలో విజయం సాధించిన అక్టోబర్ విప్లవం ప్రపంచంలోని అన్ని దేశాల వలసపాలకులపై ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా స్ఫూర్తిని కలిగించింది. కమ్యూనిజాన్ని ఏ కోశానా సమర్థించని మహాత్మాగాంధీ, మానవతా సిద్ధాంతమే తన జీవిత కవితా వస్తువుగా స్వీకరించిన రవీంద్రనాథ్ ఠాగూర్‌లు కూడా రష్యా విప్లవాన్ని ఆహ్వానించారు. జవహర్లాల్ నెహ్రూ 1920లోనే రష్యాను సందర్శించి ప్రేరణ పొందారు. ఆ తర్వాత జరిపిన కాంగ్రెస్ మహాసభల్లో సోషలిజం ఆవశ్యకతను, సమానత్వ భావనలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా విప్లవం తర్వాతనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, జాతుల విముక్తి పోరాటాలు వెల్లువెత్తాయి. చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మావో సే టుంగ్ నాయకత్వంలో చైనా విప్లవం విజయవంతమైంది. ‘‘జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు’’ అంటూ ఆనాటి విప్లవ యుగ ప్రాముఖ్యతను మావో ఉత్తేజకరంగా చాటిచెప్పారు. ఆనాడు లెనిన్ యువతరం కలల నాయకుడిగా నిలిచారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్‌సింగ్ కూడా లెనిన్ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు. భగత్‌సింగ్‌కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడగ్గా ‘‘నేను లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నాను. అది పూర్తిచేయాలనేదే నా కోరిక’’ అని భగత్ సింగ్ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్ని తరాలు మారినా, మరెన్ని వక్ర భాష్యాలు, సిద్ధాంతాలు ఉద్భవించినా ప్రపంచగమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు. మానవజాతి మనుగడ కొనసాగినంత వరకూ, దోపిడీ, పీడనలు తొలగిపోయి, ఎటువంటి వివక్షకూ తావులేని సమసమాజం ఆవిష్కృతం అయ్యేవరకు లెనిన్ అనే మూడక్షరాలు యావత్ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (81063 22077) (నేడు లెనిన్ 151వ జయంతి) -
'సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాక్‌కు'
వాషింగ్టన్: గతంలో సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాకిస్తాన్‌కు పడుతుందని ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ పేర్కొన్నారు. ఆయుధాల కోసం పోరు కొనసాగిస్తే గతంలో సోవియట్ యూనియన్ కొన్ని రాజ్యాలుగా విడిపోయినట్లు పాక్ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని హెచ్చరించారు. అమెరికాలోని ఫ్లొరిడా వర్సిటీ విద్యార్థులతో సమావేశం సందర్భంగా పాక్ తీరుపై తీవ్ర అసహనాన్ని వెల్లగక్కారు హక్కానీ. గతంలో అమెరికాలో పాక్ దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన హక్కానీ.. ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఆర్థిక శక్తి కావాలన్నారు. కానీ పాక్ అణ్వాయుధాలు, అణ్వస్త్ర సామాగ్రి.. ఉగ్రవాదం అంశాలపై దృష్టిపెట్టిందన్నారు. అణ్వస్త్ర సామర్థ్యంతో అగ్రరాజ్యాల సరసన తమ పేరు చేరుతుందని, వారితో సమానంగా తమకు గౌరవం, హోదా లభిస్తుందని పాక్ ఆలోచిస్తుందని తెలిపారు. 12-14 శతాబ్దాల్లో పరిపాలన కొనసాగినట్లు పాక్‌లో వ్యవహారం నడుస్తోందని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఆర్థికంగా శక్తిమంతమైన దేశంగా ఎదగడంతో పాటు ఆర్మీపై ఖర్చుచేసే నిధులను సామాన్య ప్రజలకు వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు హక్కానీ. ఆయన ప్రస్తుతం హడ్సన్ ఇనిస్టిస్ట్యూట్లో దక్షిణ, మధ్య ఆసియాలకు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు... విఫల చరిత్రే..!
సందర్భం ప్రధాని నరేంద్రమోదీ చేప ట్టిన నోట్ల రద్దు విధానాన్ని నాడు సోవియట్ యూనియన్‌లో జరిగిన రూబుల్స్ రద్దుతో పోల్చవచ్చు. 1991 జనవరి 22న ఆ దేశ కరెన్సీ లోని 50, 100 రూబుల్స్‌ను అధ్యక్షుడు గొర్బచేవ్ రద్దు చేశారు. 1961 నుంచి చలా మణిలో ఉన్న రూబుల్స్‌ని మూడు దశాబ్దాల తరువాత సోవియట్ యూనియన్‌లో సంస్కరణల యుగం ప్రారంభమైన నేపథ్యంలో రద్దు చేశారు. దీంతో బ్యాంక్‌లలో ప్రైవేటు ఖాతాలన్నీ నిలిచిపోయాయి. ప్రతి చోటా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 1991 జన వరి 23 నుంచి వివిధ బ్యాంకులలో వ్యక్తిగతంగా ప్రజలు 500 రూబుల్స్ మించి తీసుకోరాదని ఆంక్షలు విధిం చారు. డిపాజిట్లపై కూడా పరిమితి విధించారు. ఈ రూబుల్స్‌ను రద్దు చేసిన మూడు రోజులలో కొత్తనోట్లన్నీ బ్యాంకులకు వచ్చి చేరాయి. జనవరి 23 నుంచి 25 వరకూ పాత నోట్లను రష్యా ప్రజలు మూడు రోజులలో మార్పిడి చేసుకున్నారు. నాడు ప్రతీ వ్యక్తికీ 1000 రూబుల్స్‌ను మార్చుకోవడానికి అనుమతించారు. ఈ మార్పిడి 1991 మార్చి 31 వరకూ మాత్రమే జరి గింది. వ్యక్తిగత సేవింగ్స అకౌంటులో రోజుకు 500 రూబుల్స్ వరకే అనుమతించారు. అదే సమయంలో నల్ల ధనం మార్పిడి, వస్తువుల క్రయ విక్రయాలు భారీగా జరిగాయి. 1980లలో పెరిస్త్రోయికా, గ్లాస్‌నాస్త్ వంటి సంస్కరణల తరువాత సోవియట్ యూనియన్‌లో ప్రైవేటు ఆస్తులను కూడబెట్టడంతో అవినీతి, నల్ల ధనం బాగా పెరిగాయి. గొర్బచేవ్ తిరిగి ఆర్థిక సంస్క రణలకు తెరతీశారు. ఫలితమే రూబుల్స్ రద్దు.. పాత రూబుల్స్ అన్ని తిరిగి బ్యాంక్‌లకు వచ్చిన తరువాత రష్యా 1, 3, 5, 10, 200, 500, 1000 విలువతో కొత్త రూబుల్స్‌ను విడుదల చేసింది. మొత్తం 14 బిలియన్ల రూబుల్స్‌ను విడుదల చేశారు. 10.05 శాతం అత్యధి కంగా కరెన్సీని విడుదల చేయడం వల్ల పంపిణీలో అవ రోధాలు ఏర్పడలేదు. దీంతో సోవియట్ ప్రజలు అంతగా ఇబ్బందులను ఎదుర్కోలేదు. ముఖ్య విషయం ఏమిటంటే, 1978లో భారత ప్రధాని మురార్జీ దేశాయ్ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు విధానాన్ని సోవియట్ ప్రభుత్వం 1991లో అనుకరిం చడం విశేషం. దీన్ని నాటి రష్యన్ పత్రికలన్నీ ప్రము ఖంగా రాశాయిు. మన కమ్యూనిస్టులు ఈ చరిత్ర అంశా లను విస్మరించగా, మరోవైపున మన ప్రధాని నరేంద్ర మోదీ సోవియట్ విధానాలను ఆకళింపు చేసుకొని అదే స్థాయిలో మన జీడీ పీ కనీసం 20 శాతం పెరుగుతుందని అంచనా వేసి మార్చి 31 తరువాత జరిగే మార్పును చూడమని అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఐదు దేశాలు కరెన్సీని రద్దు చేశారుు కానీ వాటి ద్వారా సంస్కరణలు అంతంత మాత్రంగానే జరిగాయి. ఘనా దేశంలో 1982లో పన్నులను తగ్గించడానికి 50 సిడి కరెన్సీ నోట్లను రద్దు చేసింది. దాంతో ఘనా ప్రజలు బ్యాంకులకు బదులు విదేశీ కరెన్సీని నమ్ముకున్నారు. నైజీరియాలో ముహ మ్మద్ బుహారీ నేతృత్వంలోని మిలటరీ ప్రభుత్వం 1984లో పాత నోట్లను రద్దు చేసి, రంగు రంగుల కరెన్సీ లను విడుదల చేసింది. అయినా.. కరెన్సీ రద్దుతో వచ్చిన ఫలితం అంతంత మాత్రమే. టీవీ గోవిందరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది మొబైల్: 98850 01925 -
శత వసంతాల ‘అక్టోబర్’
విశ్లేషణ ప్రపంచంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం జరిగే జాతీయ విముక్తి ఉద్యమాలకు సోవియట్ యూనియన్ ఆప్తమిత్రునిగా నిలిచింది. నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమ నానికి, స్వతంత్ర శక్తిగా నిలబడేందుకు నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. ఈ నవంబరు 7వ తేదీ ఒకప్పటి సోవియట్ రష్యా శత జయంతి. ఆనాటి సోషలిస్టు విప్లవం మార్క్సిజంలోని వాస్తవికతను రేఖామాత్రంగా ప్రపంచానికి దర్శనీయం చేసేందుకు నాందీ ప్రస్తావన జరిగిన రోజు. ఆ తొలి అడుగు మానవుడు మున్నెన్నడూ ఎరుగని దిశలు పడిన రోజు ఇది. విముక్తి పొందిన నూతన సోషలిస్టు రష్యా నాటి ప్రపంచ శ్రమజీవులందరి కలల పంట. విప్లవనేత లెనిన్ వాగ్దానం చేసినట్లు – వివిధ జాతుల కారా గారంగా ఉండిన రష్యాలో అన్ని జాతులకూ విముక్తి కల్పించి, అవి స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్)గా అవతరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ మార్గదర్శకత్వంలో చైనా, వియత్నాం, క్యూబా విముక్తితో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. అయితే నాటి యూఎస్ఎస్ఆర్ నేటి ప్రపంచ చిత్రపటంలో కాన రాదు. తూర్పు యూరప్ రాజ్యాలలో సైతం సోషలిజం కనుమరుగ య్యింది. నాడు మావో నేతృత్వాన సాధించిన విముక్తి మార్గాన నేటి చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండినా పయనం సాగు తున్నదా? లేదా? అక్కడ నేడు కమ్యూనిస్టు పార్టీ పేరు కొనసాగుతు న్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి మార్గం పునర్నిర్మితమౌతు న్నదా? అన్నది ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలలో చర్చనీయాంశం. ప్రపంచ శ్రమజీవుల ప్రాణస్పదంగా ఉండిన సోషలిస్టు శిబిరం ఇలా ఎందుకు పతనమయింది? అందుకు గల కారణాలేమిటి? ఈ పతనం ఆయా దేశాల ఆచరణాత్మక తప్పిదాల ఫలితమా? నేటి భౌతిక వాస్తవిక పరిస్థితి కారణమా? ఈ పతనం వెనుక కమ్యూనిస్టు వ్యతిరేక సామ్రాజ్యవాద గుత్తాధిపతుల కుట్రల ఫలితమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తడం సహజం. అసలు కమ్యూనిజమే మానవ నైజానికి విరుద్ధం, ‘సోషలిజం’ మార్క్స్ అనే ఒక స్వాప్నికుని స్వప్నం, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమైనది అని ప్రచారం చేసే మేధా వులకూ కొదవ లేకుండా పోయింది. కానీ ఆ యూఎస్ఎస్ఆర్ ఎంతటి మహత్తర మానవత్వ కర్తవ్యాలనూ అంతర్జాతీయంగానూ తన దేశంలోనూ ఆచరించి ప్రపంచానికి చూపిందో చూద్దాం. తొలి సంస్కరణగా దున్నుకునే వారికే భూమినిచ్చే అతి మౌలిక మైన సంస్కరణ చేపట్టి రైతులను, గ్రామీణ పేదలను సోవియట్ ఆదుకున్నది. ప్రతి రంగంలోనూ రాజకీయంగా శ్రామికవర్గ పాత్ర పెంచింది. మహిళలకు ఆత్మగౌరవాన్ని, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థాయి అందించింది. విద్య, వైద్యం, గృహవసతి, దుస్తులు సామాన్య ప్రజలకు దాదాపుగా ఉచితంగా లభింపజేశారు. 40 ఏళ్లపాటు యూఎస్ఎస్ఆర్లో నిత్యావసరాల ధరల పెరుగుదల లేదు. సోష లిస్టు శిబిరంలోని దేశాలకు, నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమనానికి నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. మనదేశాన్నే తీసుకుందాం. పాశ్చాత్య దేశాలు ‘డాలర్ల’తో వ్యాపార లావాదేవీలు సాగిస్తుండగా మనకు సులభమైన రీతిలో రూపాయ లలో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించింది. మనదేశ ఆర్థిక ప్రగతికి ‘ఉక్కు’ కర్మాగారం నిర్మించమని మనం కోరితే ఇంగ్లండ్ వంటి దేశాలు ‘మీకు ఒక్క ఫ్యాక్టరీ దేనికి? సైనిక ఫ్యాక్టరీ పెట్టుకోమని హేళన’ చేశాయి. భిలాయ్‌లో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమకు నాంది పలికే సహకారం అందించింది సోవియట్ యూనియన్. నాటి యూఎస్ఎస్ఆర్ సోషలిస్టు శిబిరం నేడు లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి వ్యతిరేక వాతావరణం గమని స్తున్నాం. సృష్టిలో మారనిది అంటూ ఏదైనా ఉంటే అది మార్పు అన్నారు మార్క్స్. అందువలన భౌతిక వాస్తవిక పరిస్థితిలో వస్తున్న మార్పులేమిటి? వాటి ప్రభావం శ్రామిక వర్గంపైన వాటి రాజకీయ పార్టీలపైన ప్రభావం ఏమిటి? నిర్దుష్టంగా ఆ మార్పుల కనుగుణంగా ఏ చర్యలు చేపట్టాలి? అన్నవి పరిశీలనార్హం. ఇక మనదేశంలో మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థ అనే నిచ్చెనమెట్ల వంటి కుల అణచివేత హిందూమత సిద్ధాంతాలలో ముఖ్యమైనదిగా ఉంది. దేశంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ, మార్పుల ఫలితంగా శూద్ర కులాలే ఆధిపత్య కులాలుగా, అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తు న్నాయి. వర్ణవివక్ష, అంటరానితనం, అత్యంత వెనుకబడిన కులాలపై అణచివేత, స్త్రీలను హీనంగా చూడటం, వీరిపై అన్నిరకాల దోపిడీ, దౌర్జన్యం, అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ దశలో లెనిన్వలే సృజనాత్మకంగా మౌలికమైన శ్రమ దోపిడీని వ్యతిరేకించ డంతోపాటు కమ్యూనిస్టులు, ఆ సామాజిక శక్తులతో మమేకమై, ద్విముఖ పోరాటాన్ని నిర్వహించాలి. ‘కొటేషన్లదేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్.. వంటి నేతల రచనల నుంచి ఎన్నైనా ఇవ్వ వచ్చు. కావలసింది ప్రత్యేక పరిస్థితులకు వానిని అన్వయించడం’ అని సుందరయ్య అనేవారు. మనకాలంలో మనిషిని మనిషి దోచుకునే రూపం మారింది కానీ మానవ సమాజ దోపిడీ మాత్రం మరో రూపంలో మరింత నాజూకు గానైనా, అధికంగా సాగుతున్నది. నగ్నంగానే కలవారు, లేనివారు అనే భేదం మున్నెన్నడూ లేనంతగా స్పష్టంగా కానవస్తున్నది. గతంలో వలెనే, నేడు కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికులూ, పీడితులు, అణచివేతకు గురవుతున్న వారు అందరూ కలసి పోరాడక తప్పదు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చూస్తున్నాము. మావోయిస్టుల సాయుధ పోరాటం గానీ, కమ్యూనిస్టుపార్టీల పార్ల మెంటరీ, పార్లమెంటరీయేతర పోరాటాలు కానీ ఆ ద్విముఖ పోరా టంలో భాగమే. వివిధ కారణాలతో ఈ పోరాటంలో ముందు వెను కలు ఉండవచ్చు. కానీ చరిత్ర నిర్మాతలైన ప్రజలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని నూతన సోషలిస్టు వ్యవస్థకు దారి తీస్తారు. అమెరికాలో రెండేళ్ల క్రితం వచ్చిన వాల్ స్ట్రీట్‌పై దాడి ఉద్యమ ప్రథమ నినాదం ఏమిటి? మేము (సామాన్య ప్రజానీకం, కష్టజీవులూ అణిచివేతకు గురవుతున్న వాళ్లం) 99 శాతం, మీరు దోపిడీదారులు, ప్రగతి నిరో ధకులు కలిపి 1 శాతం! అదీ వాస్తవం! నవంబర్ 7 సోవియట్ యూనియన్ శతజయంతి సందర్భంగా, ఆ చారిత్రక పరిణామ దిశా దశల ఆధారంగా ఈ మహత్తర గుణాత్మక మార్పులో మనమూ భాగస్వాములు అవగలమని ఆశిద్దాం! (నవంబర్ 7న సోవియట్ రష్యా విప్లవ దినోత్సవ శత జయంతి) ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ 98480 69720 -
ప్రపంచం రష్యాను నమ్మట్లేదు: పుతిన్
మాస్కో: పతనమై పాతికేళ్లు కావస్తున్న తరుణంలో యూఎస్ఎస్ఆర్(యూనియన్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్) పునర్మిర్మాణంపై పశ్చిమదేశాలు వ్యక్తంచేస్తున్న అనుమానాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. రష్యా మరోసారి యూఎస్ఎస్ఆర్ ను నిర్మిస్తోందంటూ అమెరికా, యూరప్ అంతటా చలరేగుతున్న పుకార్లను ఆయన ఖండిచారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని బూచిగా చూపెడుతూ తమపై నిరాధార ఆరోపణలుచేస్తున్నారని మండిపడ్డారు. రష్యాపై పశ్చిమదేశాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ పుతిన్ మాట్లాడిన డాక్యుమెంట్.. 'పబ్లిక్ రష్యా' ఛానెల్ లో సోమవారం ప్రసారమైంది. 'మేం యూఎస్ఎస్ఆర్ ను పునర్మించాలనుకోవట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని ప్రపంచం నమ్మట్లేదు' అని పుతిన్ అన్నారు. తామే సర్వజ్ఞులమని భావించే పశ్చిమదేశాలు.. ప్రపంచంలోని మిగతాదేశాలపై అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రదర్శించే ఆసక్తిలో సగమైనా ఆఫ్రికా, మధ్య ఆసియాలపై కేంద్రీకరించి ఉంటే భూగోళం పరిస్థితి మెరుగైఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రతిదేశానికి తనదైన సంస్కృతి, మతం, వారసత్వాలు ఉంటాయి. దీన్ని రష్యా గుర్తెరిగింది కాబట్టే యూఎస్ఎస్ఆర్ గురించి ఆలోచించట్లేదు. అయితే ఈ నిజాన్ని అమెరికా, యూరప్ దేశాలు ఎన్నటికీ అంగీకరించవన్నారు. -
ఆ మహత్తర విప్లవానికి 98 ఏళ్లు
సందర్భం ఒకనాటి సోవియట్ యూనియన్ ఒక దేశంగా నేటికీ మనుగడసా గిస్తూ ఉండి ఉన్నట్ల యితే ఈ 7వ తేదీని ప్రపంచంలో మార్క్సిస్టు సిద్ధాంతం ఆలంబనగా ఏర్పడిన తొలి సోషలిస్టు రాజ్య 98వ వార్షికోత్సవ వేడుకగా యావత్ ప్రపంచంలోని శ్రమజీవులూ, తదితర పీడితులూ ఆనందోత్సాహాలతో జరుపు కుని ఉండేవారు! 70 సంవత్సరాలకుపైగా ఆ సోష లిస్టు సోవియట్ యూనియన్ అక్కడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన అంతవరకూ, ప్రపంచం ఎరుగని ప్రత్యామ్నాయ ప్రజాపాలనను సాగించింది. 1. తమ ప్రజలందరికీ జీవన భద్రత, సామాజిక న్యాయం అందించింది. 2. తమ దేశ మహిళా లోకానికి గుణాత్మకంగా ఎన్నదగిన సామాజిక స్వేచ్ఛను, సమాన హక్కులను, ప్రత్యేక గౌరవాలను కల్పిం చింది. 3. ప్రజలలో ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ అస మానతలను కనిష్ట స్థాయికి కుదించే కృషి చేసింది. 4. అంతర్జాతీయంగా విముక్తి పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచింది. 5. నూతనంగా స్వాతంత్య్రం పొందిన మన దేశం వంటి దేశాలు తిరిగి వెనువెంటనే సామ్రాజ్యవాద కబంధ హస్తాలలో చిక్కుకో కుండా సోవియట్ యూనియన్ అందించిన నిస్వార్థ సహాయం నిరుపమానమైనది. 6. హిట్లర్ ఫాసిజాన్ని ఓడించడంలో ప్రధాన భూమిక ధరించింది సోవియట్ యూని యన్. 7. సామ్రాజ్యవాదాన్ని నిలువరిస్తూ - ప్రపంచ శాంతికి పెట్టని కోటలా నిలిచింది. 8. ఆ తర్వాత సోషలిస్టు సమాజాలుగా ఏర్పడిన చైనా తదితర దేశాల ఉనికి, మనుగడను సోవియట్ సహకారం లేకుండా ఊహిం చలేం! అలాంటి సోవియట్ యూనియన్ ప్రపంచ పీడిత, తాడిత ప్రజలకు విషాదాన్నీ... సామ్రాజ్య వాద, దోపిడీ శక్తులకు ఆనందాన్నీ కలిగించే రీతిలో తన సోషలిస్టు వ్యవస్థను కోల్పోవడమే గాక, ప్రపంచ చిత్రపటం నుండి అంతరించింది. ఇందుకు అప్పటి బహిర్గత భౌతికవాస్తవ పరిస్థి తులు ఏమిటి? సోవియట్ యూనియన్ అంతర్గత పరిస్థితి ఏమిటి? ఈ విశ్లేషణ ఈ వ్యాస పరిధిలో లేదు. కానీ ఈ పరిస్థితి స్టాలిన్, కృశ్చేవ్, గోర్బచేవ్, ఇత్యాదుల తప్పిదాల వలననే జరిగిందని చెప్ప బూనడం మార్క్సిజం రీత్యానే సరైంది కాదు. చరిత్రలో వ్యక్తుల పాత్రను తక్కువ అంచనా వేయ కపోయినా నిర్ణయాత్మక శక్తి అని మాత్రం చెప్ప లేము. తన భౌతిక పరిస్థితి దృష్ట్యా చరిత్ర అందుకు అనువైన నేతలను సృష్టించుకుంటుంది. మార్క్స్ కాకపోతే మరొకరు కొంచెం ఆలస్యంగా నైనా అదనపు విలువ శాస్త్రీయ అవగాహనతో కూడిన మానవ పరిణామ చరిత్రగా గతితార్కిక భౌతిక వాదాన్ని తప్పక ప్రతిపాదించి ఉండేవారని స్వయంగా ఏంగిల్స్ అన్నారు. ఇక చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్థ తిరిగి రూపుదిద్దుకుంటున్నదనీ, తదనుగుణమైన రాజ్య వ్యవస్థ ఏర్పడటమే మిగిలి ఉందనీ భావించే ఆస్కారం నేడున్నది. వియత్నాం, క్యూబాలు సైతం తమ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూప గల సంస్కరణలను చేపట్టాయి. తూర్పు జర్మనీతో సహా తూర్పు యూరప్ రాజ్యాలలో సోషలిస్టు వ్యవస్థ మిగలలేదు. సోషలిజం విఫలమయిందనీ, దానితో మార్క్సిజం కూడా తన సైద్ధాంతిక వాస్త వితకను కోల్పోయిందనీ, పెట్టుబడిదారీ విధా నమే శాశ్వతమనీ ప్రచారం చేస్తూ సంబరపడే సామ్రాజ్యవాద దోపిడీ శక్తులు కోకొల్లలు. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గానికి పరాకాష్ట అయిన సామ్రాజ్యవాద దశకు చేరుకున్నాం. అయినా, సర్వం దాసోహం అని, ప్రపంచ మాన వాళి, దాని పాదాల ముందు మోకరిల్లకుండా దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాం. ప్రస్తు తం ఇంకా మానవాళి పురోగమనానికి ఆ ప్రయా ణం దోపిడీ, అణచివేత రహిత వ్యవస్థకు చేరుకోక పోవచ్చు. అందుకు ఇంకా చాలా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఆ దిశ మాత్రం అదేనని సూచించే మైలురాళ్లే - నాటి పారిస్ కమ్యూన్గానీ, ఆ తదు పరి వచ్చిన సోషలిస్టు సమాజాలు గానీ! అప్పుడే సోషలిజం స్థిరపడింది అని అర్థం కాదు. ఆ సోష లిస్టు వ్యవస్థ ఇలా ఉంటుంది అని ప్రజలు గ్రహిం చగలిగే సూచికలు మాత్రమే అని. వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తూ, వ్యక్తి తన శక్తి కొద్దీ స్వచ్ఛందంగా కృషి చేసి తనకు అవసరమైన భౌతిక ఆధ్యాత్మిక సంప దను అనుభవించగల వ్యవస్థకు జన్మనిచ్చే క్రమంలో పుడమి తల్లి పడుతున్న పురిటి నొప్పుల కవి చిహ్నాలు! ఎందుకు సోషలిజం విఫలమ యింది? అన్న ప్రశ్నకు అర్థం లేదు. అదొక వ్యవస్థీ కృతమైన సమాజంగా ఏర్పడితేగదా విఫలమవడానికి? మార్క్స్ మరణానంతరం ఏంగిల్స్ ‘నేనూ, మార్క్స్ రాసిన రచనలన్నింటినీ తిరిగి పరిశీలనా త్మకంగా చదివాను. మా ప్రతిపాదనలలో అక్షరం కూడా మార్సాల్సిన అవసరం లేదు. కాకుంటే అదేదో నేడో రేపో సంభవించనున్నదన్నట్లు భావించిన మా యవ్వనోద్రేకానికి మాత్రం తనివి తీరా నవ్వుకున్నాను’ అని రాశారు. లక్షల సంవత్స రాల మానవ పరిణామ క్రమంలో మార్క్సిజం అవతరించిన (కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ఆరంభం అనుకుంటే) ఈ 175 సంవత్సరాలు ఎంత? సోష లిజం సోవియట్ యూనియన్ ఆవిర్భవించిం దనుకున్న ఈ 98 సంవత్సరాలు ఎంత? ఆ సోష లిస్టు దశ నుండి కమ్యూనిస్టు దశకు చేరబోతు న్నామని బ్రెజ్నేవ్ సోవియట్ యూనియన్ గురించి ప్రకటిస్తే దాన్ని ఎంత పసితనంగా భావించాలి. ఏది ఏమైనా ముందుగా చెప్పుకున్నట్లు ఆ 70 సంవత్సరాల మనుగడలో సోషలిస్టు వ్యవస్థ శ్రమజీవులు, పీడితులకు ఒక గుణాత్మకమైన మెరుగైన జీవితాన్ని తానెంత స్థాయిలో ప్రసాదిం చగలను అనే విషయాన్ని ప్రజల ముందుంచింది. సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ ఆ దిశగా ప్రజలు పోరాడేందుకు ఒక భౌతిక చిత్రణను, ఆశను, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ఆ సోవి యట్ పుణ్యానే నేడు ప్రపంచ వ్యాపితంగా ప్రజా నీకాన్ని ఆ మార్గంలో పయనింప చేసే కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులొచ్చాయి. మార్క్సిజం ప్రస్తావన లేకుండా నేడు చరిత్రను, మానవ చరిత్రను అధ్యయనం చేయలేరనడం అతిశయోక్తి కాదు. అందుకే మార్క్సిజం నేటికీ ఆచరణాత్మ కమైన సజీవ సిద్ధాంతమే. మన దేశంలోని పరిస్థితులన్నింటిపైనా కమ్యూనిస్టు ఉద్యమం నిజాయితీగా ఆత్మపరిశీ లనా దృష్టితో మేధోమథనం జరపాలి! నిరాశాజన కంగా నేటి కమ్యూనిస్టు ఉద్యమ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుగా కమ్యూనిస్టులలో ఐక్యత సాధిం చాలి! మార్క్స్ చెప్పిన దాన్ని మరో మాటల్లో చెప్పాలంటే కమ్యూనిస్టుల అపజయ కారణం వారి అనైక్యతలోనే ఉన్నది. అలాగే మన దేశంలో కష్టజీవులు గ్రామీణ పేదల రైతాంగ ఐక్యతతో పాటు చాలా బలంగా, శతాబ్దాల తరబడి వేళ్లూను కున్న మనుస్మృతి భావజాల పరిధిలోని నిచ్చెన మెట్ల లాంటి కులవ్యవస్థలో అణచివేయబడు తున్న దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారి టీలు, ఇతర వెనుకబడిన కులాల వారు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ఈ ప్రజా సమూహాన్ని కూడా తనలో ఇముడ్చుకోవాలి. అస్తిత్వ ఉద్య మాలు శ్రామిక వర్గ ఐక్యతకు భంగం కలిగిస్తా యని, వాటిపట్ల విముఖత కూడదు. వర్గవైరుధ్యం గుర్తించడానికి ముందే వర్గ వైరుధ్య తీవ్రతను గమ నించి వ్యతిరేకించిన గౌతమ బుద్ధుడి బోధనలు ప్రభవిల్లిన చోట, ఆ రెండు రూపాల దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనకుండా శ్రామిక వర్గ విప్లవం జయప్రదం కాదు. నూటికి పదిమందికి మించని దోపిడీ, దుర్మార్గ శక్తులకు వ్యతిరేకంగా మిగిలిన 90 శాతం మందిని తనలో ఇముడ్చుకోగల విశాల ఐక్య ప్రజాపోరాటాలను, ప్రజల సమస్యలపై ఐక్యమైన కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించాలి. ఆ ఉద్యమమే మన దేశ ప్రజల అభ్యున్నతికే కాక, తమ పునరుజ్జీ వనానికి కూడా ప్రాణప్రదమన్న స్పృహతో కమ్యూ నిస్టు ఉద్యమం పూర్వవైభవాన్ని పొందాలని ఆశిద్దాం.. డా॥ఏపీ విఠల్ (నేడు రష్యన్ విప్లవం 98వ వార్షికోత్సవం సందర్భంగా...) వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్: 98480 69720