కాలం విలువ | value of time | Sakshi
Sakshi News home page

కాలం విలువ

Published Fri, Aug 21 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

కాలం విలువ

కాలం విలువ

కాలం సాక్షి! మానవుడు ఘోరమైన నష్టంలో పడి ఉన్నాడు. అయితే, దైవాన్ని విశ్వసించి, సత్కార్యాలు ఆచరిస్తూ, సత్యం, సహనాలను గురించి పరస్పరం ఉపదేశించుకునేవారు మటుకు ఏ మాత్రం నష్టపోరు. (పవిత్ర ఖురాన్. 103-1, 3)
 ఇందులో మూడు విషయాలున్నాయి. దైవ విశ్వాసం, మంచి పనులు చేయడం, సత్యం- సహనాలను గురించి పరస్పరం బోధించుకో వడం. ఈ మూడు వర్గాల వారు తప్ప మిగతా వారంతా నష్టంలో పడి (దారి తప్పి) ఉన్నారు. ‘కాలం సాక్షి!’ అనడంలోని ఔచిత్యం ఏమిటం టే, కాలం అనాదిగా అనేక సంఘటనలకు సాక్షీభూతమైనది. ఎన్నో యథార్థాలను  అది ప్రపంచానికి అందించింది. కాలం విలువను గుర్తించిన వారే ఈ యథార్థాల నుంచి గుణ పాఠం గ్రహిస్తారు. కాలం ఎవరి కోసమూ ఆగ దు.

తన కర్తవ్య నిర్వహణలో అది అప్రతిహతం గా సాగిపోతూనే ఉంటుంది. అంతేకాదు, కాలం చాలా కర్కశమైనది కూడా! అది ఎవరినీ క్షమించదు. ఎంతో మంది మహామహులు, తమ కు ఎదురేలేదని విర్రవీగిన వా ళ్లు కాలగర్భంలో కలసిపొ య్యారు. కనుక కాలం విలు వను గుర్తించాలి. అది దేవుని అపార శక్తిసామర్థ్యాలకు,  అసాధారణ కార్యదక్షతకు ప్రస్ఫుట నిదర్శన మని అంగీకరించాలి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచి పనులు చెయ్యాలి. ధర్మ బద్ధమైన కార్యాలను ఆచరించాలి. సమస్త పాప కార్యాలకు. అన్యాయం, అధర్మాలకు దూరం గా ఉండాలి. సత్యంపై స్థిరంగా ఉన్న కారణం గా కష్టనష్టాలు ఎదురుకావచ్చు. మనోవాంఛ లను త్యాగం చేయాల్సి రావచ్చు. అవినీతి, అణ చివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సత్యమార్గా న పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగండ్లు కలుగవచ్చు.

 ఇలాంటి అన్ని సందర్భాల్లో మనిషి విశ్వా సానికి నీళ్లొదలకుండా, సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్థిరంగా ఉంటూ సహనం వహిం చాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించు కుంటూ, దైవంపై భారం వేసి ముందుకు సాగా లి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతా వారు నష్ట పోతారని మనకు అర్థమవుతూ ఉంది. కనుక అందరూ కాలం విలువను గుర్తిం చి, విశ్వాస బలిమితో సత్యంపై ిస్థిరంగా ఉం టూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని బోధిస్తూ, స్వయంగా ఆచ రిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ స్థిరత్వాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.
 ఎండీ.ఉస్మాన్ ఖాన్
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement