అస్తిత్వాన్ని ఆవిష్కరిద్దాం
ప్రియమైన చంద్రశేఖరరావు గారూ! ఇది మీకు నేను రాస్తు న్న నాలుగో బహిరంగ లేఖ: తెలంగాణ ఒక వలసగా ఆరు వందల ఏళ్లు ఐదు విదేశీ పాలక వంశాల అధీనంలో ఉన్న సంగతీ, మాతృభాష తది తర అంశాల మీద ఆ వంశీకుల ఆధిపత్యం, అంతిమంగా ఆరు దశాబ్దాల ఆంధ్ర పాలకుల పాలనలో జరిగిన అన్యా యం, వీటిని సరిదిద్దుకోవడం గురించి ప్రస్తావి స్తున్నాను. రెండో ప్రతాపరుద్రుడు మహ్మద్ తుగ్లక్ చేతిలో (1323) ఓడిపోవడంతో 300 ఏళ్ల కాకతీయుల స్వర్ణయు గం ముగిసింది. ఆపై 1347 వరకు ఢిల్లీ సుల్తానత్ ఏలుబ డిలో ఉన్న తెలంగాణలో అలాదీన్ హసన్ గంగు బహ మని తిరుగుబాటుతో స్వతంత్ర రాజ్యమైంది. దీనికి గుల్బర్గా రాజధాని. దక్షిణ భారతంలో ఆవిర్భవించిన తొలి మహమ్మదీయ రాజ్యం ఇదే.
అప్పటి నుంచి ఢిల్లీ సుల్తానత్ (1324-1347) 23 ఏళ్లు, బహమనీలు (1347 -1527) 180 ఏళ్లు, కుతుబ్‌షాహీలు (1528-1686) 171 ఏళ్లు, మొగలాయిలు (1686-1723) 37 ఏళ్లు, అసఫ్ జాహీలు (1724-1948) 224 ఏళ్లు పాలించారు. ఇలా ఆరు వందల ఏళ్లు ఒక ప్రాంతం మహమ్మదీయ పాలకుల వలసగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఈ పాలకులు ఇక్కడి మాతృభాష తెలుగు స్థానంలో పర్షియ న్‌ను ప్రవేశపెట్టారు. దీనితో స్థానికులు విద్యకు దూరమై వ్యవసాయానికి పరిమితమయ్యారు. ఉద్యోగాలలో, సైన్యంలో అవకాశాలు కోల్పోయారు. కళ, వేషభాషలు మారిపోయాయి. పాలకుల ఆచార వ్యవహారాలు పాటిం చడం విద్యావంతులకు గౌరవ సూచకమైంది.
ఆరు, ఏడు నిజాం ప్రభువుల కాలంలో హైదరా బాద్ రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని పరిపూర్ణంగా ఇస్లా మీకరించడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. 1905లో చాలా పట్టణాలు, జిల్లాల పేర్లు మారాయి. ఎలగందుల (కరీంనగర్), ఇందూరు (నిజా మాబాద్), పాలమూరు (మహ బూ బ్‌నగర్), మెతుకు (మెద క్), మహబూబాబాద్ (మాను కోట), భోన్‌గిర్ (భువనగిరి), ఎదులాపురం (ఆదిలాబాద్) పేర్లు అలా మారినవే. ఈ వలస జాడలను చెరిపేసి బొంబాయి, మద్రాసు, కలకత్తా, బెంగుళూరు నగరాల పేర్లు మార్చినట్టే వీటి పేర్లు మళ్లీ మార్చాలి.
అసఫ్‌జాహీల పాలనలోనూ పర్షియన్ అధికార భాషగా కొనసాగింది. అయితే 1865లో మొదటి సాలార్ జంగ్ (ప్రధానమంత్రి) పర్షియా స్థానంలో ఉర్దూ ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఉర్దూ అధికార భాషగా, మాధ్య మంగా మారి, 1948 వరకు కొనసాగింది. నేనూ ఆ మాధ్యమంలోనే చదివాను. మా తాతగారు పర్షియా భాషా పండితుడు. ముస్లిమేతరులలో షెర్వానీ, పైజమా గౌరవ హోదాకు ప్రతీకలయ్యాయి. 1918లో ఆవిర్భవిం చిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ఉర్దూ మీడియంలోనే బోధించారు.
1948 నాటి పోలీస్ చర్య తరువాత సైనిక ప్రభుత్వా నికి పరిపాలనలో సహకరించడానికి పెద్ద ఎత్తున మద్రా స్ నుంచి ఆంధ్రా అధికారులు హైదరాబాద్‌కు వెల్లువె త్తారు. ఈ వలస చిరకాలం కొనసాగిన ఫలితంగా వేలా ది మంది అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, యువకులు వచ్చారు. నకిలీ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చి మరి కొన్నివేల మంది ఆంధ్రా యువ కులు హైదరాబాద్‌లో ఉద్యోగాలలో చేరడానికి అధికా రులు అవకాశం కల్పించారు.
1948-52 మధ్య మరోసారి సైనిక దండయాత్ర (విముక్తి?)తో తెలంగాణ ఔత్తరాహుల పాలనలోకి వెళ్లిం ది. ఈ కాలంలోనే తెలంగాణ ప్రమేయం ఏమీ లేకుండానే జా తీయ ప్రభుత్వం ఏలింది. 1956లో తెలంగాణ మరో సారి వలసగా మారింది. ఈసారి ఈ ప్రాంతం ఆంధ్ర పాలకుల అంతర వలసగా మారింది. ఇది ‘ప్రజాస్వామ్య’బద్ధంగానే జరిగి నప్పటికి తెలంగాణకు మైనారిటీ వాటా 40 శాతమే దక్కింది. ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, సంస్కృతి, విద్య ఆంధ్రాపాలకుల ఆధిపత్యంతో దోపి డీకి గురయ్యాయి. ఆంధ్ర వలసవాదులు తెలుగు మాట్లా డే వారిగా, ఇక్కడి వారికి సోదరులమన్నట్టు నటించారు. ఈ 58 ఏళ్ల పాటు వారు మన వనరులు, భూములు, ఉద్యోగాలు, నీరు దొంగిలించారు. మన సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనీ అవహేళన చేశారు.
ఈ నేపథ్యంలోనే వలస ముద్ర నుంచి తెలంగాణ సమాజం విముక్తం కావడానికి కొన్ని చర్యలను సూచి స్తాను. ముఖ్యమంత్రి వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి.
1. తెలంగాణ చరిత్రను పునర్ లిఖించుకోవాలి.
2. పాఠశాలల, కళాశాలల పాఠ్యపుస్తకాలలో సంపూ ర్ణమైన మార్పు తేవాలి.
3. మొఘల్, ఆంధ్ర సంస్కృలను తుడిచివేసి తెలం గాణ సంస్కృతిని పునరుద్ధరించాలి.
4. పురావస్తు ప్రదర్శనశాలలు, అభిలేఖాగారాలను నెలకొల్పాలి.
5. తెలంగాణ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలను నిర్వహించాలి.
6. పాఠశాలల్లో, కళాశాలల్లో నైతిక సూత్రాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి.
7. తెలంగాణ సాహిత్యం, లలిత కళలను అభివృద్ధి చేయాలి.
8. వివిధ కాలాలకు చెందిన తెలంగాణ వీరుల గురిం చి పుస్తకాలు ప్రచురించాలి.
9. పెద్ద సంఖ్యలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పాలి.
10. విద్యా నిలయాలుగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాల యాలను పటిష్టం చేయాలి.
11. నైపుణ్యంతో ఉండే విధంగా సంస్థలను మలచాలి.
12. నగరాలకు జరుగుతున్న వలసలను తగ్గించడానికి గ్రామాలను ఆధునీకరించాలి.
13. అన్ని రంగాలలోను యోగ్యతకు ప్రోత్సాహం కల్పిం చాలి.
14. ఎన్నికలలో ధన, కండబలాలను నిర్మూలించాలి.
15. వరంగల్ తదితర పట్టణాలలో కీర్తిప్రతిష్టలను చాటే ప్రాంగణాలు నిర్మించాలి.
16. ఢిల్లీలోని ఇండియా గేట్ నమూనాలో మృతవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి.
కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు ఉత్తర తెలంగా ణలో పుట్టి పెరిగిన, సాధారణ పౌరులతో మమేకమైన పాలకుల ఏలుబడిలో ఉన్నారు. ఇక ఆంధ్రావారి పాలన గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. 1948 నాటి విముక్తి నిజానికి విముక్తి కాదు, ఒక విదేశీ పాలన నుంచి ఇంకో విదేశీ పాలనకు మారడమే. ఇంకో విధంగా చెప్పాలంటే 1324 నుంచి 2014 వరకు మన ముందు 25 తరాలు, తరువాతి తరం వారు సొంత గడ్డ మీద బానిసలు, సేవ కులుగా జీవనం గడిపారు. 2014లో తెలంగాణ స్వతం త్ర పాలనలోకి వచ్చి, మీరు ప్రభుత్వాధినేత అయ్యి రెండో ప్రతాపరుద్రుని వారసుడయ్యారు. అందుకే జూన్ 2, 2014 తెలంగాణ అసలైన విమోచన దినమవుతుంది. మీరు కేవలం వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, సేవారంగం, పట్టణ గ్రామాల అభివృద్ధికే పరిమితం కారాదు. తెలంగాణ ప్రజల మీద గాఢంగా ఉన్న వలస వాద జాడలను తుడిచివేసే పని కూడా చేపట్టాలి.
(వ్యాసకర్త మాజీ ఎంపీ) మొబైల్:77029 41017
- ఎం. నారాయణరెడ్డి
panditnr@gmail.com