Telangana language
-
ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!
సాక్షి, తెలంగాణ: కేసీఆర్‌కు భాష మీదా, సామెతల మీద పట్టెక్కువ. మొన్ననే జడ్చర్ల, మేడ్చల్ సభల్లో ‘కాంగ్రెస్ వస్తే కాటగలుస్తం’, ‘గోల్మాల్ చేసేటోళ్లతోని గోసవడ్తం’, ‘రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటరు’.. అంటూ ప్రసంగించారు. సామెతల్తో చెప్పే మాట చట్టుక్కున ఎక్కుతది. అదే ధోరణి అన్ని పార్టీలు అనుసరించినప్పుడు.. కారు సారు కేసీయారు మాట తీరు.. ఈ కాంగ్రెసోళ్లు ఎట్లాంటోళ్లంటే..‘ముచ్చటపెట్టేటాయన బిచ్చం బెట్టడు. ఊరబిస్కెను గోసి ఊరంత పంచుతనంటడు’. ఈళ్ల పనితీరు ఎట్లుంటదంటే..‘పప్పుల ఉప్పేసెటప్పుడు చెప్పెయ్యే కోడలా అంటే.. కాళ్ల ఏసుకునే చెప్పేసి అత్తకు ఇస్తర్ల అంచుకుపెడతరు’. ఇగ ఈళ్ల కత ఎట్లుంటదో తెలుసా? కర్ణాటకల 20 గంటలు కరెంటిస్తనన్నరు. ఇప్పుడు కటకట బడ్తున్నరు. ‘ఏం లేనోనికి ఎచ్చులెక్కువ..చిన్నకుండలో అన్నానికి పొంగులెక్కువ’. ఇంగ వాళ్ల పార్టీలో సీఎమ్ములెక్కువై.. ’సచ్చినపామును కొట్టడానికి అందరూ సిపాయిలే’. ఇగ ఈ పువ్వుపార్టీవోళ్లయితే ఏ రాష్ట్రంల ఎవడు ఏ పార్టీల గెలిసినా వాళ్లు కొని.. ‘ఎక్కడ మేస్తె ఏంది, మా ఇంట్లె ఈన్తె సాలు, మా సావిట్లె పాలిస్తె సాలు’ అంటరు. మా ఎమ్మెల్యేలను కూడా కొనబోయిన్రు కదా. ‘ఆగబోగాలు అంకాళమ్మవైతే.. పొలికేకలు పోలేరమ్మవి’ అన్నట్టు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తరు. ఆ కొనుడు కూడా ‘ఎర్రను చూపిచ్చి, చాపను పట్కపోతరు’. వీళ్లకంతా ఆస్తులు అమ్ముకోవడమే పని. ‘కతలమారి మొగుడు కమ్మలు జేయిస్తె.. అప్పుల గల మొగుడు అమ్ముకుతింటడు’ బాపతు ఈ పార్టీ. ఇసొంటోళ్లను ఎన్నుకోకండి. ‘సంకకు ఎక్కిన పిల్ల సచ్చినా దిగద’ని గుర్తుంచుకోండి. ఇదే స్టైల్లో... కాంగ్రెస్‌వాళ్ల సభల మాటల తీరు.. తెలంగాణ మేమే ఇచ్చినా.. ఇప్పిచ్చినాయనే మీకు ముద్దొచ్చిండు. ఏమైంది? ‘ఎద్దును చూస్తె ముద్దొస్తదీ, దున్నబోతె దుక్కమొస్తది’ అన్నట్టయింది. ఇచ్చిన మమ్మల్నే ఇడిసిపెట్టి ‘నవ్వుకుంట తిడితిరి.. నరకాన బడ్తిరి’. అందుకే ‘ఊరికి పొయ్యేటోన్ని ఇడిసిపెట్టి, నిద్రపొయ్యేటోనికి సద్దిగట్టకున్రి’. వాళ్లను ఎన్నుకున్రా.. ఏమైతది? ‘జీవి ఇడిసిందాక మంచినీళ్లూగూడ పొయ్యజాలనోళ్లు.. సచ్చింతర్వాత మీ బొందమీద పాలిచ్చే బర్రెను కట్టేస్తా’ అన్నట్టే ఉంటది. దీనికి నిదర్శనమే రూ. 400కు సిలండరు. మరి అంతగనం ఇచ్చేటోళ్లు మేము రూ.500 అన్నదాక ఎందుకియ్యలే. ఇప్పుడు వీళ్లైనా, ఆ పువ్వు పార్టీవోళ్లైనా ‘తాత సంపాయించిన ఆస్తి.. మనవడితో మట్టిపాలు’ అన్నట్టుగా అమ్ముకుని తింటున్నది మా హయాంలో జరిగిన అభివృద్ధినే కదా. ఇగ పువ్వు పార్టీలోళ్లు అచ్చం సంప్రదాయాలే మాట్లాడతరు. ‘ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పున్నెం’ అనుకుంట ఆకే ఇస్తరు గని అన్నం పెట్టరు. మనమేదన్న మర్యాద జెయ్యబోతె..‘అల్లుడొచ్చిండని కల్లు దెస్తె నీసులేదని కేసుపెట్టినట్టు’ సీబీఐ, ఈడీలతోని కేసులు పెట్టిస్తరు. అన్నింటికి ట్యాక్సులేసి ‘ఇంటి ఎద్దుకు కూడ కిరాయికట్టమంటరు’. ‘ఆటాపాటా మా ఇంట్ల... మాపటి బువ్వ మీ ఇంట్ల’ అంటరు. ఇప్పుడు పువ్వుపార్టీవాళ్ల ప్రసంగాలు.. మాది పువ్వు గుర్తు. మేము ఆవు పార్టీ. ‘ఆవు పాలల్ల అరవైఆరు పిండివంటలు’ ఉంటయి. అందుకే ఎవడన్న ‘ఆవును ఇచ్చి.. పలుపు దాచుకుంటడా?’ అట్లాంటి పని ఎప్పుడూ చేయకండి. ‘ఆవులేని ఇంట అన్నమే తినవద్దు’ అంటరు. ఆట్లాంటిది మన సొంత రాష్ట్రంలో ఆవు పార్టీని లేకుండా చేసుకుంటరా.. మీరే చెప్పండి. అప్పుడు జనాలు.. మా బతుకులన్నీ ‘ఎంత పెరిగినా గానీ.. గొర్రెకు బెత్తెడే తోక’ అన్నట్టు. ప్రతిపూటా మా ‘గతిలేనోళ్లకు గంగే పాయసం’. ఎంత చెడ్డా మీరంత ఒక్కటే. ‘ఈత కాయ ఇచ్చినట్టే ఇచ్చి.. తాటికాయ తీసుకుంటరు’. ‘అన్నం పెడితే అరిగిపోతది.. చీరె ఇస్తె చినిగిపోతది.. వాత పెడ్తె కలకాలం ఉంటది’ అని మాకు వాతలు బెడతరు. మీ ధోరణంతా ‘ఆశ గలమ్మ దోషమెరగదూ.. పూటకూళ్లమ్మ పుణ్ణెమెరగదు’లా అందరూ అందరే. అందరూ ఒక్కటే. అందుకే ‘కర్రుగాల్చి వాత పెట్టాలె’. అది ఎవరికి పెడతామో చూద్దురుగానీ. -
తెలంగాణ భాషకు పట్టం కట్టేలా తెలుగు మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ యవనికపై తెలంగాణ భాష, సాహిత్యానికి పట్టం కట్టేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు రమణాచారి పేర్కొన్నారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి రవీంద్రభారతిలో రెండ్రోజుల్లో కార్యాలయం ఏర్పాటు చేసి సలహాలు స్వీకరిస్తామన్నారు. గురువారం ఆయన సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎ.శ్రీధర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలుగు వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారా యణలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా మహాసభలు జరుగుతాయని, తెలుగువారు అధికంగా ఉన్న దేశం లోని ఇతర నగరాలు, విదేశాల్లోని నగరాల్లో త్వరలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి వెబ్సైట్ ప్రారంభిస్తామని చెప్పారు. ఉత్సవాలకు రూ.50 కోట్లు.. ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని, ప్రత్యేకంగా సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు ఇచ్చి ందని రమణాచారి తెలిపారు. మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. పత్రికల్లో కూడా తెలంగాణ భాష, సాహిత్య ఔన్నత్యాన్ని కళ్లముందు కట్టేలా కథనాలు రావాలని, ఉత్తమ కథనాలకు పురస్కారాలు కూడా ప్రదానం చేస్తామ న్నారు. తెలంగాణ సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పటమే వేడుకల ఉద్దేశమని నందిని సిధారెడ్డి అన్నారు. 50 మంది తెలంగాణ వైతాళికులకు సంబంధించిన పుస్తకాలను వెలువరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ప్రాచుర్యం లభించిందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభాకరరావు అన్నారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యం, దేవాలయాలు, శాసనాలు, జలవనరులు.. అన్ని వివరాలతో ప్రత్యేక సంచికను త్వరలో వెలువరిస్తామని తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్డులో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌కే పరిమితమైన వైతాళికుల విగ్రహాలు నెక్లెస్‌రోడ్డులోకి కూడా చేరనున్నాయి. తెలంగాణ వైతాళికుల విగ్రహాలను నెక్లెస్‌రోడ్డులో కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు రమణాచారి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసిన ఓ కమిటీ విగ్రహాల విషయాన్ని పరిశీలిస్తోందని, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆ విగ్రహాల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. -
తెలంగాణ మాండలిక మాగాణం వొయినం
వొయినం; రచన: జాజుల గౌరి; ప్రచురణ: విశాల సాహిత్య అకాడెమీ; పేజీలు: 200; వెల: 50; రచయిత్రి చిరునామా: 3-16-5, నెహ్రూ నగర్, రామంతాపూర్, హైదరాబాద్; ఫోన్: 8519923199 కష్టాలను ఎదుర్కొని, కన్నీళ్లను దిగమింగి భూమిని కాపాడుకునేందుకు ఓ మహిళ పోరాటం, ఆమె పడిన ఆరాటానికి అద్దం పడుతుంది జాజుల గౌరి నవల ‘వొయినం’. ఆద్యంతం తెలంగాణ మాండలికంలో సాగి, అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి చిన్నాన్న, చిన్నమ్మల పెంపకంలో ఎన్నో ఆరళ్లను చవిచూసిన మొగిలయ్య పాత్ర హృదయాలను కదిలింపజేస్తుంది. నీలమ్మను పెళ్లాడి ఇద్దరు పిల్లలను కన్న మొగిలయ్య తన భూమిని కాపాడుకునే ప్రయత్నంలో తనువు చాలిస్తాడు. పాలివాళ్ల నుంచి ఆ పొలాన్ని దక్కించుకునేందుకు నీలమ్మ ఎన్నో కష్టాలను చవిచూస్తుంది. అన్ని ఆటుపోట్లను తట్టుకుని, అయినవారే ఇబ్బందులకు గురి చేసినా చివరకు తన వాటాగా వచ్చే భూమిని సొంతం చేసుకుంటుంది. సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో 1970- 80ల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసిన ఈ నవల ఒంటరి మహిళ గుండె దిటవును కళ్లకు కడుతుంది. మొగిలయ్య పాత్ర వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనిషి’లోని సాంబయ్యను గుర్తుకు తెస్తుంది. అక్కడక్కడా తెలంగాణ జానపదాలు పాఠకుల మనోముకురంలో తారట్లాడుతాయి. ఈ రచన ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, శివరామ కారంత్ ‘తిరిగి మరల సేద్యానికి’ స్థాయిలో సాగిందని బీఎస్ రాములు రాసిన ముందుమాట అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఓ దళిత మహిళ ధీరోదాత్త, వీరోచిత పోరాట గాథకు దర్పణంగా నిలుస్తుందీ రచన. తెలంగాణ మాగాణంలో పండిన అక్షర, నానుడుల సిరుల పంట ‘వొయినం’. - మైల కుమార్ మట్టి రూపాయి పొద్దంతా మొక్కజొన్న చేనుకు చిరిగిన చీర ఎరువును వెన్నముద్దల్లా అందిస్తుంటే ఖాళీ ప్లేట్లో బిస్కెట్ పుట్టుకొస్తుంది విరిగిన చేతికర్ర గడ్డి మేస్తున్న చీకటిముద్దలకు కాపలా కాస్తుంటే కాఫీకప్పులో వెన్నెల విరగకాస్తుంది చొక్కాలేని చెమట దేహం పచ్చని వరిపైరుకై నీరైపోతుంటే ఆకలి కడుపున సన్నబియ్యం ఉడుకుతుంది మసకబారిన కళ్లద్దం పచ్చి పళ్లను పక్కనెట్టి పండిన టమాటో సూరీళ్లను ఏరుతుంటే బ్రెడ్డుపై జామ్ కూర్చుంటుంది మాసికల నిక్కరు మాసిన గౌను మండుటెండలో మగ్గిన మామిడిపళ్లవుతుంటే ఎండిన గొంతున జూసై జారుతుంది పల్లె మట్టిలో చిందిన ప్రతి చెమటబొట్టు రెక్కలొచ్చిన రూపాయి కాసై మొలిచి మార్కెట్ సరుకులను మోస్తూ నిత్యం నగరానికెగిరిపోతుంటుంది - మొయిద శ్రీనివాసరావు 9908256267 మంగళవాచకం విద్యావంతులు, ఎందరో సివిల్ సర్వీస్ విజేతలను తయారుచేసిన కె.సర్వమంగళగౌరి జ్యోతిలక్ష్మీ సినిమాను పుస్తకరూపంలో సమీక్షించారు. పురాణాలు, ఇతిహాసాలు, స్త్రీ ఉద్ధరణ రచనలు అన్నీ చదివిన మంగళగౌరి వాటి ఊతంతోనే జ్యోతిలక్ష్మీని పోల్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీలో కథావస్తువు వేశ్యవృత్తిలోని ఓ మహిళ, ఆమె పట్ల సమాజ ప్రవర్తన, వాళ్ల విషయంలో ఆ మహిళ ప్రతిస్పందన. ‘సమాజం స్వార్థంతో తయారుచేసిన అభాగ్య వేశ్య’ అన్న రచయిత్రి మాటలు అక్షర సత్యాలు. గురజాడ కన్యాశుల్కంతో జ్యోతిలక్ష్మీని పోల్చడం రచయిత్రి చేసిన మరో సాహసం. షాండీ కొంతవరకు గిరీశం అంటూ జ్యోతిలక్ష్మీని మధురవాణితో పోల్చారు. ‘సానిదాని జీవితానికి బతుకనేదే లేదు కదా’ అంటుంది మధురవాణి. కానీ, ఆ నిస్పృహలోకి జ్యోతిలక్ష్మీ ఎప్పుడూ పోలేదనీ, ఆమెకు తన వృత్తిపట్ల గౌరవం, వాస్తవిక దృష్టి, తనను గౌరవించలేని సమాజాన్ని ఎదిరించే గుణం మూడు ఎక్కువేననీ అంటారు రచయిత్రి. సమీక్ష అంటే కేవలం, కథా సన్నివేశాల వర్ణనే కాదనీ, సినిమా ఆత్మను దర్శింపజేయడమనీ నిరూపించారు. (జ్యోతిలక్ష్మీ; రచన: కె.సర్వమంగళగౌరి; రచయిత్రి ఫోన్: 09866222978)ృ - రమేష్ గోపిశెట్టి పసి ప్రార్థన బడులు తెరిచారు పసి తరగతి ప్రారంభమయ్యింది పిల్లలు బోరు బోరున విలపించారు ఆ రోజుకి అదే తొలి ప్రార్థన - కొండూరి రామరాజు 9542042003 రెక్కలు రహదారి అనకొండ చెట్లు మింగింది తారు తాగిన రోడ్డు ప్రాణాల్ని తీసింది మనిషి నీడ సైతం ఏడుస్తోంది మట్టి మనసు మొక్క కెరుక మొక్క మనసు నీటి కెరుక మనసు లేని మనిషి ప్రకృతి కెరుక - డా॥రమణ యశస్వి 9848078807 ఈవెంట్ దేశ రాజధానిలో కువ్వ ఆవిష్కరణ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎం.ఆర్.పి.ఎస్. చేస్తున్న దీక్షల్లో భాగంగా నేడు డప్పోల్ల రమేష్ సంపాదకత్వం వహించిన వర్గీకరణ సంఘీభావ కవిత్వ సంకలనం ‘కువ్వ’ను ఆవిష్కరించనున్నారని బహుజన సాంస్కృతిక వేదిక ఉపాధ్యక్షులు సొన్నాయిల బాల్‌రాజ్ తెలియజేస్తున్నారు. ఆవిష్కర్త: మంద కృష్ణ మాదిగ. వక్తలు: పసునూరి రవీందర్, మాతంగి చిరంజీవి, కాకాని సుధాకర్. భాషా బోధనలో సవాళ్లు- సదస్సు నేడు విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీసీ నిధులతో ‘భాషా బోధనలో సవాళ్లు’ అంశంపై జాతీయ సదస్సు జరగనుందని ప్రిన్సిపల్ వల్లూరుపల్లి రవి తెలియజేస్తున్నారు. ఆచార్యులు వి.లక్ష్మి, ఎన్.ఉష, వి.శంకరరావు, కోయి కోటేశ్వరరావు, డి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ముఖ్య వక్తలు. రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ప్రారంభం ‘తెలుగు ఆధునిక సాహిత్యంలో విశాఖపట్నం తన కార్యక్షేత్రంగా విస్తారమైన సాహిత్య సృజనకు పేరు మోసిన’ రావిశాస్త్రి పేరుమీదుగా అదే విశాఖలో రావిశాస్త్రి సోదరుడు రాచకొండ నరసింహశర్మ ఛైర్మన్‌గా ‘రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్’ ఏర్పాటైంది. వారి కుటుంబ సభ్యులు ముగ్గురు ఈ ట్రస్టులో కొనసాగుతారు. సాహిత్య రంగం తరఫున చందు సుబ్బారావు, ఎల్.ఆర్.స్వామి, వి.కల్యాణ రామారావు, పి.జయశీలారావు, జగద్ధాత్రి బాధ్యతలు వహిస్తారు. ఈ ట్రస్ట్ ప్రతి ఏటా జూలై 30న రావిశాస్త్రి జయంతి సందర్భంగా పది వేల నగదుతో ‘రావిశాస్త్రి అవార్డు’ ఇవ్వనుంది. రామతీర్థకు రావిశాస్త్రి అవార్డు రావిశాస్త్రి జయంతి వేడుకలు జూలై 30న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనున్నాయి. ఇందులో భాగంగా, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టును కె.రామచంద్రమూర్తి ప్రారంభిస్తారు. రావిసారాలు, ఖ్చఛిౌ్ట్ఛఠట ఖ్చఛిజ్చిజుౌఛ్చీ పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. అలాగే, తొలి రావిశాస్త్రి అవార్డును రామతీర్థకు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా, ‘రామతీర్థ సృజన రేఖలు’ గురించి నండూరి రాజగోపాల్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో మాటూరి శ్రీనివాస్, రాచకొండ ఉమాకుమార శర్మ, జి.శిబానంద, గరిమెళ్ళ నాగేశ్వరరావు, డి.వి.సూర్యారావు, పేరి రవికుమార్, మంగు శివరామప్రసాద్, చింతకింది శ్రీనివాసరావు, పి.అనంతరావు, ఎ.వి.ఆర్.మూర్తి, డి.సహదేవరావు, కె.జి.వేణు, పి.రాజేశ్ పాల్గొంటారు. రమణజీవి కథలపై సమీక్షా సమావేశం ప్రజా పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో రమణజీవి కథల సంకలనం ‘సింహాలపేట’పై సమీక్షా సమావేశం జూలై 31న ఉదయం 10 గంటలకు అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. నగ్నముని, ఆర్కే, సీతారాం, ఎస్.నారాయణ, కె.ఎం.రాయుడు, బోస్ పాల్గొంటారు. జీలానీ బానూ కథల ఆవిష్కరణ మెహక్ హైదరాబాదీ తెలుగులోకి అనువదించగా ‘నవచేతన’ ప్రచురించిన జీలానీ బానూ కథల సంకలనం ‘గుప్పిట జారే ఇసుక’ ఆవిష్కరణ సభ జూలై 31న సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లిలో జరగనుంది. అధ్యక్షత: కె.శ్రీనివాస్. ఆవిష్కర్త: ఓల్గా. జీలానీ బానూ, అషఫ్ ్రరఫీ, తెలిదేవర భానుమూర్తి, ఎన్.మధుకర్ పాల్గొంటారు. సమావేశకర్త: సమ్మెట నాగమల్లేశ్వరరావు. కొత్త పుస్తకాలు దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త! రచన: రంగనాయకమ్మ; పేజీలు: 408(హార్డుబౌండు); వెల: 150; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866-2431181 ‘తల్లిదండ్రులు నిర్దయులైతే, మూర్ఖులైతే, జాగ్రత్తలు పడవలసింది ఎవరు? -ఇంకెవరు? వాళ్ళ చేతుల్లో చిక్కి వున్న పిల్లలే’ అంటారు రచయిత్రి. ‘దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయ్యాక, దేన్ని సహించాలో, దేన్ని తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము దృఢ పరచుకోవాలి’ అని హితవు చెబుతూ సాగే ‘నవ్య’ నవల ఇది. ఒక్కపదం - అర్థాలెన్నో రచన: రాజావాసిరెడ్డి మల్లీశ్వరి; పేజీలు: 196; వెల: 140; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఐ., హైదరాబాద్-68; ఫోన్: 24224453 ‘ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’, ‘రేపు మాపు’, ‘చేపలను పట్టటానికి పెట్టే మాపు’ అనే విధాలుగా వాడబడుతుంది. ఇలాంటి మన తెలుగు భాషా పదాల అందాన్ని, ప్రత్యేకతను పిల్లలకు తెలియజేసే సంకల్పము’తో వెలువరించిన పుస్తకం ఇది. శ్రమ జీవన విద్యా విప్లవ కావ్యం రచన: ఎం.శివరాం; పేజీలు: 280; వెల: 112; ప్రతులకు: మంచి పుస్తకం, 12-13-439, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్-17; ఫోన్: 9490746614 ‘(జిడ్డు) కృష్ణమూర్తి గారి టీచింగ్‌ను పూర్తిగా’ జీవిస్తున్న శివరాం, ‘ప్రేమే ఈ ప్రపంచాన్ని నివాస యోగ్యంగా చేయగలదని- అనేక మంది పిల్లలతో, పెద్దలతో మాట్లాడుతూ పోవటమే తన పని అంటారు’. అదే ఫిలాసఫీతో, ‘ఏమిటీ విద్యా అంటే, మార్కులు, ర్యాంకులేనా? శ్రామికత, పనీపాటా విద్యలోకి రావా? శుభ్రతని గురించిన స్పందనకి, స్వచ్ఛందమయిన శ్రమప్రవృత్తికీ స్కూల్స్‌లో, టీచర్స్‌లో ఏ విధమైన మన్నింపు ఉంది?’ లాంటివి ఈ పుస్తకంలో చర్చిస్తున్నారు. -
తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం
డాక్టర్ భాస్కరయోగి హన్మకొండ కల్చరల్ : తెలంగాణ భాష, యాసను మహోన్నతంగా నిలిపేదే జానపద సాహిత్యమని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పి.భాస్కరయోగి అన్నారు. వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠంలో శనివారం సాయంత్రం తెలంగాణ జానపద సాహిత్యంపై ప్రసంగం జరిగింది. నమిలికొండ నారాయణరావు స్మారకోపన్యాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భా స్కరయోగి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత అస్థిత్వాన్ని, సహజత్వాన్ని తెలిపేదే తెలంగాణ జానపద సాహిత్యమన్నారు. ఇక్కడి జానపదుల జనజీవనం, ఆచారాలు, పండుగలు, ఉత్సవాలు, నమ్మకాలు, శ్రామికజీవనం, కుటుంబవ్యవస్థ అన్నీ వారికి వస్తువులని తెలిపారు. తెలంగాణ జనజీవన lసంస్కృతి ఈ సాహిత్యంలో ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని కోరారు. అనంతరం దూపకుంట కాకతీయ కళాసమితి ఆధ్వర్యంలో జానపద గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, కేయూ తెలుగుశాఖ ఆచార్య బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, ఆచార్య ఎంవీ రంగారావు, వరిగొండ కాంతారావు, వీఆర్ విద్యార్థి, పల్లె నాగేశ్వర్రావు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్ శర్మ, కుందావజ్జుల కృష్ణమూర్తి, మారేడోజు సదానందచారి, మల్లికార్జున్, పాంచాలరాయ్, వీరాచారి, రఘురామయ్య, గోకులరాణి, బాలాజీ, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
తెలంగాణ భాష, చరిత్ర పుస్తకాలు
ఆగస్టు 20, 2015 నుంచి తెలంగాణ సారస్వత పరిషత్తుగా వ్యవహారంలోకి వచ్చిన ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ తెలంగాణ చరిత్ర, భాషా సాహిత్యాలు, సంస్కృతిపై 12 పుస్తకాలను ప్రచురించింది. తెలంగాణ మూలాలను కొత్తగా తెలుసుకోగోరేవారికీ, పరిశోధించేవారికీ ఇవి చాలా విలువైనవి. వీటికి ప్రధాన సంపాదకులుగా సి.నారాయణరెడ్డి, సంపాదకులుగా జె.చెన్నయ్య వ్యవహరించారు. వీటిలో ‘సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు’, ‘యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’(దేవులపల్లి రామానుజరావు), ‘తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు’(రవ్వా శ్రీహరి), ‘తెలుగు జానపద సాహిత్యము’(చింతపల్లి వసుంధరారెడ్డి), ‘మా వూరు మాట్లాడింది’(సినారె) పునర్ముద్రణలు. ఇక కొత్తగా ముద్రించినవి: ‘తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు’(వ్యాస సంకలనం), ‘బంజారాల వివాహ ఆచార పద్ధతులు’(అజ్మీర సిల్మానాయక్), ‘తెలంగాణ చరిత్ర’ (జి.వెంకట రామారావు), ‘ప్రాచీన తెలంగాణ కవుల కవితా ప్రాభవం’ (వ్యాస సంకలనం), ‘తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర’ (ముదిగంటి సుజాతారెడ్డి), ‘పరిణత వాణి’(ఆత్మకథ ప్రసంగ వ్యాసాలు), ‘కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్య సేవ’ (వ్యాస సంకలనం). వీటి ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, హైదరాబాద్; ఫోన్: 040-24753724 మాంత్రిక వినిర్మాణం కుమార్ కవిత్వం చదివే క్రమంలో... ఒక పేజీ నుంచి మరో పేజీకీ ప్రయాణించే క్రమంలో అడుగులు తడబడవచ్చు. అంతమాత్రాన ప్రయాణాన్ని రద్దు చేసుకోలేము, వాయిదా వేసుకోలేము, పునఃప్రయాణాలు ప్రారంభిస్తూనే ఉంటాము. అతని వాక్యాల్లో సంక్లిష్టత ఉండొచ్చుగానీ భావాల్లో లేదు. అర్థం చేసుకున్నకొద్దీ అర్థం చేసుకున్నంత భావం మనసుకు అందుతుంది. ప్రకృతి నుంచి ప్రపంచీకరణ వరకు, ఆకాశంలోని తెల్లటి కొంగల నుంచి భూమ్మీది టీ గరగరల వరకు అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. వినిపిస్తాయి. మౌనంగా దాక్కున్న మనోసంగీతం... వాక్యాల వెంట పరుగులు తీస్తూ... కొత్త రాగమై పలకరిస్తూనే ఉంటుంది. ‘అతని మాంత్రిక వినిర్మాణ పదచిత్రాలని అర్థం చేసుకోవటం ద్వారా గొప్ప కవిత్వ అనుభూతిని సాధించగలుగుతాం’ అని కుమార్ కవిత్వం గురించి సాగర్ శ్రీరామకవచం చెప్పిన మాట అక్షర సత్యం. 1. సాకీ వృత్తాలు... పరిపూర్ణ మృత్యు శిల్పం పేజీలు: 166; వెల: 100 2.దేవుడు చనిపోయిన టీ టేబుల్ పేజీలు: 170; వెల: 100 కవి: బి.ఎస్.ఎం.కుమార్ ప్రతులకు: కవి, 14-179/1, గణేశ్‌నగర్ కాలనీ, ఆర్.ఎన్.రెడ్డినగర్, హైదరాబాద్-97; ఫోన్: 9705085143 ఈ సి.చేతన్ స్మృతి కవిత ఆగనిపాట ఆమెకి ఇష్టమైన పాటలు లోలోపల కిక్కిరిసి వినిపిస్తున్నాయి, తెలిసీతెలియని రాగాలతో వచ్చీరాని సంగీతంతో నేను ఆలపించడం ఆమె మళ్ళీమళ్ళీ పాడమనడం; ఆమె గునగునమనే భక్తిగీతాలు ఒకటో రెండో, ముక్కలు ముక్కలై అనంతంగా తీగసాగుతున్నట్టు ఇంకా నాలోపల, ఏదో సాంప్రదాయిక వాయిద్యం మోగిస్తూ పిల్లగాలి తుంపరలతో గొంతుకలిపి పాడుతున్న ఒక అరేబియా సుందరిలా ఆమె నా శ్రావ్యలోకంలో రాగఝరులు పొంగిస్తూ నాలుగు దశాబ్దాలు నాతో కలిసి చేసిన ఆలాపన ఇంకా సాధనలా కొనసాగుతున్నట్టు ఇంకా ఆమెకి ఇష్టమైన ఆ పాటలు నా లోపల కిక్కిరిసి వినిపిస్తున్నాయి, కొత్త మేఘాలు కమ్ముకుంటున్నా పాత వేసవి ఉక్కిరిబిక్కిరి చేస్తూనేవుంది, కొత్త జల్లులు, కొత్త చినుకులు, కొత్త వానలు అయినా ఆ పాత మట్టివాసన ఆమె కిష్టమైన పాటలా నన్ను పెనవేసుకుంటూనే వుంది ఆమె ఒక పాటగా మారి నా శ్రవణేంద్రియాలను సదా ఆవహిస్తూనే వుంది, ఇంకా! (9 సెప్టెంబర్ 2015 రాజీ తొలి వర్ధంతికి) ఈ దేవిప్రియ 9866111874 కథతో ఒకరోజు ‘కథాసాహితి’, ‘ప్రజ్వలిత’ సంయుక్త నిర్వహణలో ‘కథ-2014’ ఆవిష్కరణ నేడు ఉదయం 9.45కి గౌతమ్ గ్రాండ్ హోటల్, రైల్వేస్టేషన్ దగ్గర, తెనాలిలో జరగనుంది. కథాసాహితి సంకలనాల పరంపరలో ఇది 25వది. ఆవిష్కర్త: వంశీ. వక్తలు: మృణాళిని, కె.శివారెడ్డి, పెనుగొండ లక్ష్మీనారాయణ. సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. సంకలనంలోని కథకులతో ముఖాముఖిని ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు నిర్వహిస్తారు. లావు నరేంద్రనాథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ, ఎన్.జె.భిక్షు, ఆర్.వి.రామారావు, ఎం.వి.రాయుడు, సంధ్య కథతో తమ అనుబంధాన్ని వివరిస్తారు. ప్రేక్షకులతో ముఖాముఖిని అంబటి మురళీకృష్ణ నిర్వహిస్తారు. పాపినేని రచన ‘ద్రవాధునికత’ను బి.తిరుపతిరావు, ‘సాహిత్య బాటసారి శారద’ వెబ్సైటును పాటిబండ్ల దక్షిణామూర్తి ఆవిష్కరిస్తారు. రోజంతా జరిగే ఈ కార్యక్రమాల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాగళ్ల వెంకటదుర్గాప్రసాద్, అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారు. గురజాడ జయంతి సభ గురజాడ జయంతి సందర్భంగా, మొజాయిక్ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖ పౌరగ్రంథాలయంలో సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు ‘ముప్పయ్యేళ్ల తెలుగు - వర్తమానం- భవిష్యత్తు’ సదస్సు జరగనుంది. అధ్యక్షత: ఎల్.ఆర్.స్వామి. వక్తలు: ఎ.మల్లేశ్వరరావు, జగద్ధాత్రి, దుప్పల రవికుమార్, విజయభాను కోటే, చాగంటి తులసి. అనంతరం అయ్యగారి సీతారత్నం ‘సాధిత’, పత్తి సుమతి ‘యావత్తు మన వేదంలో వున్నాయిష’ పుస్తకావిష్కరణలుంటాయి. సమీక్ష: చందు సుబ్బారావు, రామతీర్థ. జాషువా సాహిత్య సదస్సు గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా, గుంటూరు ఏసీ కాలేజీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సదస్సు జరగనుంది. తెలుగు సాహిత్యంలో జాషువా విశిష్టత, జాషువా శైలి-వస్తు వైవిధ్యం, జాషువా సాహిత్యం- సామాజిక వాస్తవికత అంశాలపై సమావేశాలుంటాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్, జె.డి.శీలం, ఎం.వి.ఎస్.శర్మ, బి.వి.రాఘవులు, కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్, గోరటి వెంకన్న, పి.ముత్యం, కె.ఎస్.లక్ష్మణరావు, తెలకపల్లి రవి, కత్తి పద్మారావు, అద్దేపల్లి రామమోహన్‌రావు, రావెల సాంబశివరావు, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ఎండ్లూరి సుధాకర్, బి.వేదయ్య, ఖాదర్ మొహియుద్దీన్, కోయి కోటేశ్వరరావు, ఆండ్ర మాల్యాద్రి, కొలకలూరి మధుజ్యోతి,సి.ఎస్.ఆర్.ప్రసాద్, ఎం.ఎం.వినోదిని, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎం.స్వర్ణలతాదేవి, మోదుగుల రవికృష్ణ పాల్గొంటారు. మరిన్ని వివరాలకు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పి.వి.రమణ ఫోన్: 7396493100 ‘రంగినేని’ పురస్కారం కోసం... గత పదకొండేళ్లుగా ఇస్తున్న ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ కోసం 2013, 2014, 2015 సంవత్సరాల్లో ప్రచురించిన కవితా సంకలనాలు 5 ప్రతుల్ని అక్టోబర్ 26 లోపు కింది చిరునామాకు పంపాలని ‘ట్రస్టు’ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు కోరుతున్నారు. అవార్డు కింద 15 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం ఇస్తారు. రంగినేని సుజాత మోహన్‌రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల-505301. మరిన్ని వివరాలకు కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ ఫోన్: 9441677373 ‘మల్లెతీగ’ ఆహ్వానం మల్లెతీగ పురస్కారం(2015) కోసం కవితల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రధాన పురస్కారం 5 వేల నగదు, మరి ఐదుగురికి వెయ్యి చొప్పున ఆత్మీయ పురస్కారాలిచ్చే దీనికోసం ప్రత్యేకంగా రాసిన సామాజిక స్పృహతో కూడిన కవితల్ని ఫొటోతో సహా అక్టోబర్ 31లోగా కింది చిరునామాకు పంపాలి. కలిమిశ్రీ, మల్లెతీగ సాహిత్య వేదిక, డోర్ నం. 41-20/3-24, మన్నవవారివీధి, కృష్ణలంక, విజయవాడ-520013. ఫోన్: 9246415150 మచ్చు తునకలు (జీవితపు లోగిళ్ళకు అద్దం పట్టే కథలు) పేజీలు: 272; వెల: 150 ప్రతులకు: కవిత పబ్లికేషన్స్, 3/75, రాయవరం, ఖాదరాబాద్ పోస్ట్, ప్రొద్దుటూరు - 516 362 ఫోన్: 9063077367 -
తెలుగు అంటేనే తెలంగాణ భాష
- డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు అంటేనే తెలంగాణ భాష అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భాష పరంగా తెలంగాణ వివక్ష ఎదుర్కొందని, భాష, యాసను కాపాడుకోవాల్సిన అవసరం వుందన్నారు. తెలంగాణ భాష, నుడికారానికి కాళోజీ నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాషపై మక్కువ ఎక్కువని సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. భాషా పండితులకు పదోన్నతుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని దేశపతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలంగాణ భాష శ్వాసగా కాళోజీ సాహితీ సేద్యం చేశారని కవి నందిని సిద్ధారెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఎన్జీఓ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా పాల్గొన్నారు. -
అస్తిత్వాన్ని ఆవిష్కరిద్దాం
ప్రియమైన చంద్రశేఖరరావు గారూ! ఇది మీకు నేను రాస్తు న్న నాలుగో బహిరంగ లేఖ: తెలంగాణ ఒక వలసగా ఆరు వందల ఏళ్లు ఐదు విదేశీ పాలక వంశాల అధీనంలో ఉన్న సంగతీ, మాతృభాష తది తర అంశాల మీద ఆ వంశీకుల ఆధిపత్యం, అంతిమంగా ఆరు దశాబ్దాల ఆంధ్ర పాలకుల పాలనలో జరిగిన అన్యా యం, వీటిని సరిదిద్దుకోవడం గురించి ప్రస్తావి స్తున్నాను. రెండో ప్రతాపరుద్రుడు మహ్మద్ తుగ్లక్ చేతిలో (1323) ఓడిపోవడంతో 300 ఏళ్ల కాకతీయుల స్వర్ణయు గం ముగిసింది. ఆపై 1347 వరకు ఢిల్లీ సుల్తానత్ ఏలుబ డిలో ఉన్న తెలంగాణలో అలాదీన్ హసన్ గంగు బహ మని తిరుగుబాటుతో స్వతంత్ర రాజ్యమైంది. దీనికి గుల్బర్గా రాజధాని. దక్షిణ భారతంలో ఆవిర్భవించిన తొలి మహమ్మదీయ రాజ్యం ఇదే. అప్పటి నుంచి ఢిల్లీ సుల్తానత్ (1324-1347) 23 ఏళ్లు, బహమనీలు (1347 -1527) 180 ఏళ్లు, కుతుబ్‌షాహీలు (1528-1686) 171 ఏళ్లు, మొగలాయిలు (1686-1723) 37 ఏళ్లు, అసఫ్ జాహీలు (1724-1948) 224 ఏళ్లు పాలించారు. ఇలా ఆరు వందల ఏళ్లు ఒక ప్రాంతం మహమ్మదీయ పాలకుల వలసగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఈ పాలకులు ఇక్కడి మాతృభాష తెలుగు స్థానంలో పర్షియ న్ను ప్రవేశపెట్టారు. దీనితో స్థానికులు విద్యకు దూరమై వ్యవసాయానికి పరిమితమయ్యారు. ఉద్యోగాలలో, సైన్యంలో అవకాశాలు కోల్పోయారు. కళ, వేషభాషలు మారిపోయాయి. పాలకుల ఆచార వ్యవహారాలు పాటిం చడం విద్యావంతులకు గౌరవ సూచకమైంది. ఆరు, ఏడు నిజాం ప్రభువుల కాలంలో హైదరా బాద్ రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని పరిపూర్ణంగా ఇస్లా మీకరించడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. 1905లో చాలా పట్టణాలు, జిల్లాల పేర్లు మారాయి. ఎలగందుల (కరీంనగర్), ఇందూరు (నిజా మాబాద్), పాలమూరు (మహ బూ బ్‌నగర్), మెతుకు (మెద క్), మహబూబాబాద్ (మాను కోట), భోన్గిర్ (భువనగిరి), ఎదులాపురం (ఆదిలాబాద్) పేర్లు అలా మారినవే. ఈ వలస జాడలను చెరిపేసి బొంబాయి, మద్రాసు, కలకత్తా, బెంగుళూరు నగరాల పేర్లు మార్చినట్టే వీటి పేర్లు మళ్లీ మార్చాలి. అసఫ్‌జాహీల పాలనలోనూ పర్షియన్ అధికార భాషగా కొనసాగింది. అయితే 1865లో మొదటి సాలార్ జంగ్ (ప్రధానమంత్రి) పర్షియా స్థానంలో ఉర్దూ ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఉర్దూ అధికార భాషగా, మాధ్య మంగా మారి, 1948 వరకు కొనసాగింది. నేనూ ఆ మాధ్యమంలోనే చదివాను. మా తాతగారు పర్షియా భాషా పండితుడు. ముస్లిమేతరులలో షెర్వానీ, పైజమా గౌరవ హోదాకు ప్రతీకలయ్యాయి. 1918లో ఆవిర్భవిం చిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ఉర్దూ మీడియంలోనే బోధించారు. 1948 నాటి పోలీస్ చర్య తరువాత సైనిక ప్రభుత్వా నికి పరిపాలనలో సహకరించడానికి పెద్ద ఎత్తున మద్రా స్ నుంచి ఆంధ్రా అధికారులు హైదరాబాద్‌కు వెల్లువె త్తారు. ఈ వలస చిరకాలం కొనసాగిన ఫలితంగా వేలా ది మంది అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, యువకులు వచ్చారు. నకిలీ ముల్కీ సర్టిఫికెట్లు ఇచ్చి మరి కొన్నివేల మంది ఆంధ్రా యువ కులు హైదరాబాద్‌లో ఉద్యోగాలలో చేరడానికి అధికా రులు అవకాశం కల్పించారు. 1948-52 మధ్య మరోసారి సైనిక దండయాత్ర (విముక్తి?)తో తెలంగాణ ఔత్తరాహుల పాలనలోకి వెళ్లిం ది. ఈ కాలంలోనే తెలంగాణ ప్రమేయం ఏమీ లేకుండానే జా తీయ ప్రభుత్వం ఏలింది. 1956లో తెలంగాణ మరో సారి వలసగా మారింది. ఈసారి ఈ ప్రాంతం ఆంధ్ర పాలకుల అంతర వలసగా మారింది. ఇది ‘ప్రజాస్వామ్య’బద్ధంగానే జరిగి నప్పటికి తెలంగాణకు మైనారిటీ వాటా 40 శాతమే దక్కింది. ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, సంస్కృతి, విద్య ఆంధ్రాపాలకుల ఆధిపత్యంతో దోపి డీకి గురయ్యాయి. ఆంధ్ర వలసవాదులు తెలుగు మాట్లా డే వారిగా, ఇక్కడి వారికి సోదరులమన్నట్టు నటించారు. ఈ 58 ఏళ్ల పాటు వారు మన వనరులు, భూములు, ఉద్యోగాలు, నీరు దొంగిలించారు. మన సంస్కృతినీ, సాహిత్యాన్నీ, భాషనీ అవహేళన చేశారు. ఈ నేపథ్యంలోనే వలస ముద్ర నుంచి తెలంగాణ సమాజం విముక్తం కావడానికి కొన్ని చర్యలను సూచి స్తాను. ముఖ్యమంత్రి వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి. 1. తెలంగాణ చరిత్రను పునర్ లిఖించుకోవాలి. 2. పాఠశాలల, కళాశాలల పాఠ్యపుస్తకాలలో సంపూ ర్ణమైన మార్పు తేవాలి. 3. మొఘల్, ఆంధ్ర సంస్కృలను తుడిచివేసి తెలం గాణ సంస్కృతిని పునరుద్ధరించాలి. 4. పురావస్తు ప్రదర్శనశాలలు, అభిలేఖాగారాలను నెలకొల్పాలి. 5. తెలంగాణ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలను నిర్వహించాలి. 6. పాఠశాలల్లో, కళాశాలల్లో నైతిక సూత్రాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. 7. తెలంగాణ సాహిత్యం, లలిత కళలను అభివృద్ధి చేయాలి. 8. వివిధ కాలాలకు చెందిన తెలంగాణ వీరుల గురిం చి పుస్తకాలు ప్రచురించాలి. 9. పెద్ద సంఖ్యలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పాలి. 10. విద్యా నిలయాలుగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాల యాలను పటిష్టం చేయాలి. 11. నైపుణ్యంతో ఉండే విధంగా సంస్థలను మలచాలి. 12. నగరాలకు జరుగుతున్న వలసలను తగ్గించడానికి గ్రామాలను ఆధునీకరించాలి. 13. అన్ని రంగాలలోను యోగ్యతకు ప్రోత్సాహం కల్పిం చాలి. 14. ఎన్నికలలో ధన, కండబలాలను నిర్మూలించాలి. 15. వరంగల్ తదితర పట్టణాలలో కీర్తిప్రతిష్టలను చాటే ప్రాంగణాలు నిర్మించాలి. 16. ఢిల్లీలోని ఇండియా గేట్ నమూనాలో మృతవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి. కాకతీయ సామ్రాజ్యంలో ప్రజలు ఉత్తర తెలంగా ణలో పుట్టి పెరిగిన, సాధారణ పౌరులతో మమేకమైన పాలకుల ఏలుబడిలో ఉన్నారు. ఇక ఆంధ్రావారి పాలన గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. 1948 నాటి విముక్తి నిజానికి విముక్తి కాదు, ఒక విదేశీ పాలన నుంచి ఇంకో విదేశీ పాలనకు మారడమే. ఇంకో విధంగా చెప్పాలంటే 1324 నుంచి 2014 వరకు మన ముందు 25 తరాలు, తరువాతి తరం వారు సొంత గడ్డ మీద బానిసలు, సేవ కులుగా జీవనం గడిపారు. 2014లో తెలంగాణ స్వతం త్ర పాలనలోకి వచ్చి, మీరు ప్రభుత్వాధినేత అయ్యి రెండో ప్రతాపరుద్రుని వారసుడయ్యారు. అందుకే జూన్ 2, 2014 తెలంగాణ అసలైన విమోచన దినమవుతుంది. మీరు కేవలం వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, సేవారంగం, పట్టణ గ్రామాల అభివృద్ధికే పరిమితం కారాదు. తెలంగాణ ప్రజల మీద గాఢంగా ఉన్న వలస వాద జాడలను తుడిచివేసే పని కూడా చేపట్టాలి. (వ్యాసకర్త మాజీ ఎంపీ) మొబైల్:77029 41017 - ఎం. నారాయణరెడ్డి panditnr@gmail.com -
తెలంగాణ భాషను కాపాడుకుందాం
* మన సంస్కృతికి జర్నలిస్టులు జీవం పోయాలి * రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు * నవ తెలంగాణ నిర్మాణంలోనూ చొరవ చూపాలి * ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీదే ఉందని, జర్నలిస్టులు తెలంగాణ భాషలోనే కథనాలు రాసి మన సంస్కృతికి జీవం పోయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా తొలి మహాసభలకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పత్రికల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో సెన్సేషన్ వార్తలు రాయాలనే తాపత్రయంతో వాస్తవాలను దారి తప్పిస్తున్నారని ఆయన అన్నారు. సద్విమర్శలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు. తప్పుచేస్తే మీడియా వదిలిపెట్టదనే భావన తీసుకురావాలని సూచించారు. సద్విమర్శలతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసి చూపిస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల సమాచారాన్ని కూడా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలాంటి సీఎం కాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిద్ర లేకుండా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రతిరోజూ రెండు గంటలపాటు 12 పత్రికలను చదువుతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిన 14 ఏళ్ల కాలంలో ఉద్యమం గురించి తప్ప.. కనీసం కుటుంబం గురించి కూడా ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. ఐఏఎస్‌లు లేక పనులు సాగడం లేదు.. ‘రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కానీ వాటిని అమలు చేయడానికి తగినంతమంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు, ప్రభుత్వం ఒంటికాలు మీదనే పరుగు పెడుతోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 140 మంది వరకు ఐఏఎస్ అధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం మనకు కేవలం 60 నుంచి 65 మంది ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారని, మళ్లీ కొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని ఆయన చెప్పారు. కీలకమైన శాఖలకు కూడా ఇన్చార్జ్ కమిషనర్లతోనే నెట్టుకురావాల్సి వస్తుందని అన్నారు. జనార్దన్‌రెడ్డి అనే ఐఎస్ఎస్ అధికారికి 8 శాఖలు కేటాయించడం జరిగిందని, తీరా ఆధికారిని ఆంధ్రకు కేటాయించారని ఇక పనులు ఎలా సాగుతాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఐఏఎస్‌ల పంపకాల ప్రక్రియ పూర్తిచేస్తుందో, ప్రధాన మంత్రి ఆ ఫైల్ మీద ఎప్పుడు సంతకం చేస్తారో... మన రాష్ట్రంలో ఐఏఎస్‌ల సమస్య ఎప్పుడు తీరుతుందోనని అన్నారు. మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలి: డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలని, జిల్లాలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేకపోవడం విచారకరం అని అన్నారు. ఐజేయు నాయకులు, విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్అలీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ రాజమణి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుల పొరపాట్లను సరిచేసే బాధ్యత జర్నలిస్టులదే తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు చూపించిన చొరవను.. నవ తెలంగాణ నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ చూపించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. పాలకులు ఎలాంటి పొరపాట్లు చేసినా.. వాటిని సరిచేసే బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని తెలిపారు. ఈ గురుతర ధర్మాన్ని నిర్వర్తించడానికి జర్నలిస్టులు నిబద్ధతతో ఉండాలని, విషయంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. నాయకులు సద్విమర్శలు స్వీకరిస్తేనే సమాజగతిలో మార్పులు చోటుచేసుకొని, అభివృద్ధికి పునాదులు పడతాయన్నారు. ‘స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం భారతావనికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.. ఆయన పాలన తీరుపై ఒక్క సద్వివిమర్శ కూడా రాకపోవడంతో.. తానేమైనా నియంతగా వ్యవహరించానా?’ అని ఆయన ఆత్మ విమర్శ చేసుకున్నారని గుర్తుచేశారు. ఇలా ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శతో తప్పులు సరిదిద్దుకొని గమ్యాన్ని నిర్దేశించుకున్న నేత లే లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.