
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ సెక్రటరీ భుపేంద్ర యాదవ్, పార్టీ మీడియా హెడ్ అనిల్ బలూనీ ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. 1994లో జయప్రద రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీతో మొదలైంది, తర్వాత ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో వచ్చిన బేధాబిప్రాయాలతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పార్టీలో చేరారు.
రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల్లో పార్టీ నుంచి 2010 సస్పెండ్ అయ్యారు. గతంలో సమాజ్‌వాది పార్టీలో రాంపూర్ నియోజకవర్గం నుంచి మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే, అయితే ఈసారి ఎస్పీ నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్‌పై పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment