న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ల వర్షంపై ఉత్తరప్రదేశ్ సీఎం, ఎస్పీ అధినేత అభిలేష్ యాదవ్ తనదైన స్టైల్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేలా పోత్సహించాలని మోదీ బుధవారం ట్వీట్లు చేశారు. మన దేశ వయోజనులందరూ ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్య భారతానికి మంచిదని తన ట్వీట్లలో కోరారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్‌పవార్, మాయావతి, అఖిలేష్‌యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్ తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు.
ప్రధాని పిలుపుపై అఖిలేష్ స్పందిస్తూ.. ‘అవును. మోదీ నిజం చెప్పారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధాని కోరుతున్నట్టు వారిలో పరివర్తన వస్తుంది. మా ఆలోచన అదే. మోదీ ఆలోచన కూడా మా ఆలోచన లాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటే అది అధికార పార్టీని గద్దె దించేందుకు దోహదపడుతుంది. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్టు ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వబోతున్నారు.’ అని ట్విటర్ వేదికగా అఖిలేష్ రియాక్ట్ అయ్యారు. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖలను తన ట్వీట్లలో ట్యాగ్ చేశారు మోదీ. గంట వ్యవధిలోనే మోదీ 29 ట్వీట్లు చేయడం విశేషం. కాగా, ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న మొదలయ్యే ఎన్నికలు మే 19న పూర్తవనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడుతాయి.
दिल ख़ुश हुआ कि प्रधान मंत्री जी भी #MahaGathbandhan से #MahaParivartan की अपील कर रहे हैं। मैं भी सभी भारतीय नागरिकों से अनुरोध करता हूँ कि ज़्यादा से ज़्यादा संख्या में मतदान करें और नया प्रधान मंत्री चुनें। https://t.co/8BsWOdClud
— Akhilesh Yadav (@yadavakhilesh) March 13, 2019
Comments
Please login to add a commentAdd a comment