ముంబై : లోక్‌సభ ఎన్నికల వేళ అందరి దృష్టి సినీ, క్రీడా ప్రముఖులపై పడింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌లు ఈ సారి ఎన్నికల పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ అమృత్ సర్, గంభీర్ సెంట్రల్ ఢిల్లీ నుంచి బీజేపీ తరుపున పోటీలో నిలుచుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు. తాను రాజకీయ రంగప్రవేశం చేసున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు.
(రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్)
రాజకీయాలు తన అజెండా కాదన్నారు. తాను సినిమాల ద్వారా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. అంతేకానీ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా లేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. తాను సినిమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యానని.. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి ఏజెంట్‌గా లేనన్నారు.
సామాజిక అంశాలతో పాటు సందేశాత్మక చిత్రాలతో అభిమానులను అక్షయ్ కుమార్ మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా రైతులకు, సైనికులకు సహాయం చేయడానికి సెలబ్రిటీలలో అందరికంటే ముందుంటున్నాడు. ఓటు హక్కుపై చైతన్యం, మై భీ చౌకీదార్ వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అక్షయ్‌కుమార్‌ను ట్యాగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మోదీ ట్వీట్‌పై అక్షయ్ కుమార్ త్వరగా రియాక్ట్ అవుతుండటంతో రాజకీయ రంగప్రవేశంపై అనుమానాలు కలిగాయి.
ఎన్నికల్లో పోటీపై అక్షయ్ కుమార్ క్లారిటీ
Published Mon, Mar 18 2019 7:46 PM | Last Updated on Mon, Mar 18 2019 7:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment