సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పిచ్చోని చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎ.ఉమామాధవరెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండేళ్ల కిందట సీఎం అపాయింట్‌మెంట్ అడిగితే ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. మాధవరెడ్డి అంటే అభిమానం అంటూనే ఇబ్బందులు పెట్టే కుట్రలకు సీఎం దిగుతున్నారని దుయ్యబట్టారు.
పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని, ఎవరి పొత్తు లేకున్నా టీడీపీ బలం ఏమిటో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. 1983లో స్వయంగా ఎన్టీఆర్ టికెట్ ఇస్తే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment