
సాక్షి, హైదరాబాద్ : ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఆయన వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో పాలనలో చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. వ్యవస్థలు దోషులు కావనీ, చంద్రబాబే దోషి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ద్రోహం చెసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పార్టీ కోసం వాడుకున్నారన్నారు.
చదవండి : కోడెల రాజకీయ చరిత్ర అంతా దౌర్జన్యాలే!
గతంలో ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పుత్రుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పక్కకు నెట్టేశారని విమర్శించారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలనే చంద్రబాబు కల ఎప్పటికీ నేరవేరదన్నారు. ప్రజల ఓట్లు దొంగిలించేందుకే స్పీకర్ కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్‌లోని వెళ్లి తలుపులు వేసుకున్నారని ఆరోపించారు. కోడెల రిగ్గింగ్‌కు పాల్పడడం వల్లే ప్రజలు తిరగబడ్డారన్నారు. చంద్రబాబు దుష్ట పాలన అంతం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment