అమిత్‌షాకు చేదు అనుభవం | Amit Shah Faces Bitter Experience In Tirumala Visit | Sakshi
Sakshi News home page

అమిత్‌షాకు చేదు అనుభవం

Published Fri, May 11 2018 1:05 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Amit Shah Faces Bitter Experience In Tirumala Visit - Sakshi

సాక్షి, తిరుపతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు చేదుఅనుభవం ఎదురైంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతూ, గో బ్యాక్‌ నినాదాలు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర షా కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేశారు. నిరసనల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారుల్ని చెదరగొట్టి షా కాన్వాయ్‌ని పంపించేశారు.

అందుకే దాడి జరిగింది: కాగా, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ‘‘నోటికొచ్చినట్లు మాట్లాడి మోసం చేశారు కాబట్టే దాడి జరిగింది. ఒక్క తిరుపతిలోనేకాదు బీజేపీకి దేశమంతా ఇదే పరిస్థితి వస్తుంది. వారు ఆ వేంకటేశ్వరుడి ఆగ్రహం చవిచూడక తప్పదు’’

చంద్రబాబు ఆగ్రహం: అలిపిరిలో అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి చేసిన టీడీపీ శ్రేణుల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణకు అందరూ బద్ధులై ఉండాలని, తెలిసీ తెలియకుండా ప్రవర్తించి, పార్టీకి చెడ్డపేరు తేవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement