సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరే కంగా రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం చేయడం దేశ ద్రోహమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ ఆయన పార్టీ ఎంపీ లు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు చట్టం చేసిన తరువాత దానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే ఏమవుతుంది? అదొక చిత్తు కాగితంతో సమానం. సీఏఏ అనేది ఎవరికి వ్యతిరేకం? పౌరసత్వం ఇచ్చేది తప్ప తొలగించేది కాదని ముఖ్యమంత్రి గ్రహించాలి. పౌరసత్వం మీద నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రమేశ్ బాబు పౌరసత్వంపై వివాదం ఉంది. దానిపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోగలిగిందా? అసెంబ్లీ సభ్యుడి పౌరసత్వంపై నిర్ణయం తీసుకోలేనప్పుడు ఇతరుల పౌరసత్వం గురించి నిర్ణయం తీసుకోగలదా?’అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై మత హింస జరుగుతోందని, వారికి రక్షణ కల్పించేందుకే ఈ పౌరసత్వం ఇస్తున్న సంగతిని విస్మరించరాదని పేర్కొన్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment