
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో ఉండగా ఏనాడూ రైతుల గురించి పట్ట ని కాంగ్రెస్ నేతలు ఇపుడు వారి గురించి మొసలికన్నీళ్లు కారుస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫారసులను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడు వాటి గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. అధికారంలో ఉండగా రైతుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు. ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినా వాటిని పెండింగులో పెట్టారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment