
గోరఖ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీఎం యోగి
లక్నో/పట్నా : మెగా ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు, బిహార్‌లోని ఒక లోక్ సభ స్థానానికి ఆదివారం ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీని ఓడించేందుకు బద్ధశత్రువులుగా పేరుగాంచిన ఎస్పీ-బీఎస్పీలు ఈ ఉప ఎన్నికల కోసం చేతులు కలిపాయి.
ఇక బిహార్‌లోని అరారియా లోక్ సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. మహాకూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మార్చి 14న ఫలితాలు వెలువడుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment