
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్‌రెడ్డి వెనకేసుకొస్తుండటంతో అసలు ఆయన టీడీపీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న సందేహం కలుగుతోందని బీజేపీ పేర్కొంది. చంద్రబాబును వెనకేసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందా అన్న విషయం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేయాలని కోరింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసు విచారణ కేంద్రం పరిధిలో లేనప్పటికీ రేవంత్‌రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్‌చేసి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీృకేడీ అంటూ మాట్లాడటం దారుణమని, అసలు కేడీ పనిచేసి దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గవర్నర్‌ను కలిసిన కిషన్‌రెడ్డి
రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న పూర్వపు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment