Revath reddy
-
రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి? : హరీశ్ రావు
-
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలిరోజు మంగళవారం ఉదయం స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులరి్పంచనుంది. అనంతరం సభను 24వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తారు. తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేయనున్నారు. 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం అనంతరం, ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో స్కిల్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 25న మంత్రివర్గ భేటీ: అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకు రెండు విడతలుగత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగింది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. -
ఈరోజు సాయంత్రంకల్లా లక్ష రూపాయల వరకు రుణమాఫీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
-
నేడు టీపీసీసీ విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో బుధవారం మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతోపాటు ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్య దర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఇన్చార్జ్గా నియమితురాలైన తర్వాత మంగళ వారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్ మున్షీ కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కు మార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరు సతీశ్ తదితరులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. సీఎంను కలిసిన దీపాదాస్ మున్షీ రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ హోదాలో దీపాదాస్ మున్షీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు ఆయనతో చర్చించారు. అంతకు ముందు మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డితోనూ మున్షీ భేటీ అయ్యారు. రేపు ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్ల మెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డిల్లీ వెళ్లనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. -
ఆట మొదలైంది..సీఎం రేవంత్ రెడ్డిపై వార్ షురూ..
-
పిసుకుడు పాలిటిక్స్
-
పార్టీలు మార్చేవారికి తెలంగాణలో స్థానం లేదు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘పూటకో పార్టీ మార్చి.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనివారికి.. అవకాశవాద రాజకీయనేతలకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ యాదమ్మతోపాటు పలువురు సర్పంచ్‌లు శనివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ అధినేత చంద్రబాబు వస్తే తెలంగాణ పొలిమెరల వరకు ప్రజలు తరమికొట్టారని గుర్తు చేశారు. ‘కొత్త, కొత్త పార్టీలు వచ్చాయి.. వారికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఉందా.. వంద కోట్లమంది ఒప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్రం అన్న వైఎస్సార్ వారసులను ఇక్కడి ప్రజలు ఎందుకు ఆశీర్వదించాలి’ అని ప్రశ్నించారు. తెలంగాణపై అసెంబ్లీలో మాట్లాడితే గొంతు నొక్కింది వైఎస్సార్ కాదా అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. -
ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి, సంఘ విద్రోహ శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ప్రాణహాని నేపథ్యంలో తనకు 4+4 భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. వ్యాజ్యంలో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, వికారాబాద్ ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపే అవకాశం ఉంది. -
రేవంత్ రెడ్డి అక్రమార్జనపై సోదాలు
-
రేవంత్ టీడీపీలో ఉన్నారా కాంగ్రెస్‌లోనా: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్‌రెడ్డి వెనకేసుకొస్తుండటంతో అసలు ఆయన టీడీపీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న సందేహం కలుగుతోందని బీజేపీ పేర్కొంది. చంద్రబాబును వెనకేసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందా అన్న విషయం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేయాలని కోరింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు విచారణ కేంద్రం పరిధిలో లేనప్పటికీ రేవంత్‌రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్‌చేసి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. మోడీృకేడీ అంటూ మాట్లాడటం దారుణమని, అసలు కేడీ పనిచేసి దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన కిషన్‌రెడ్డి రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న పూర్వపు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులొచ్చాయ్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులొచ్చాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన కుటుంబ క్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకే తాము బస్సుయాత్ర చేపట్టామని, ఈ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ఉత్తమ్ కోరారు. మిషన్ భగీరథ పేరుతో కమీషన్లను బాగా తిన్న కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నాడని ఉత్తమ్ అన్నారు. కేటీఆర్‌ను తిట్టేందుకు రేవంత్‌రెడ్డే సరైనోడని అన్నారు. తనపై కేసులున్నాయని, 2014 ఎన్నికలలో డబ్బులు దొరికాయని కేటీఆర్ పదేపదే అంటున్నారని, ఈ కేసును హైకోర్టు కూడా కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల తర్వాత ఏదో వాహనంలో రూ.1.75 లక్షల రూపాయలు దొరికితే ఆ డబ్బు తనదని పెట్టిన కేసులో నిజం లేదని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. బచ్చా కాదు... లుచ్చా ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బచ్చా అంటే ఊరుకోనని కేటీఆర్ అంటున్నారని, అందుకే ఆయన బచ్చా కాదు లుచ్చా అని అంటున్నామని, ఏం చేస్తాడో చేసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద కేసులున్నాయని కేటీఆర్ పదేపదే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మా మీద కేసులుంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరిన శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్‌తో పాటు ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ల నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఉత్తమ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌కు భద్రత పెంచండి
కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. భద్రత పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి పోరాడుతున్నారని, ఉద్యమాలు చేస్తున్నారని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో ఆయనకు ప్రాణహాని ఉందని, అదనపు భద్రత కోసం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. రేవంత్‌కు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అదనపు భద్రత కల్పించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌కు చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.