
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి, సంఘ విద్రోహ శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ప్రాణహాని నేపథ్యంలో తనకు 4+4 భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు.
వ్యాజ్యంలో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర, ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, వికారాబాద్ ఎస్‌పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment