శ్రీనగర్: కశ్మీర్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జమ్మూ ప్రాంతంలో ఉన్న 446 వార్డుల్లో 169 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 96 చోట్ల గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు 167 సీట్లతో రెండోస్థానంలో నిలిచారు. కశ్మీర్ లోయలోని 42 మున్సిపల్ కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికల్లో 178 వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించగా, కాంగ్రెస్ 157 స్థానాల్లో గెలిచింది.
ఆశ్చర్యకరంగా, బీజేపీ అభ్యర్థులు కశ్మీర్ లోయలో 100 వార్డుల్లో గెలిచారు. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ చట్టబద్ధతపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్ని బహిష్కరించాయి. దీంతో జమ్మూలో 36 మున్సిపాలిటీల్లో బీజేపీ 15 చోట్ల, స్వతంత్రులు 12 చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల మెజారిటీ స్థానాలను దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment