సాక్షి, తిరుపతి : ఓటమి భయంతోనే చంద్రగిరిలో రీపోలింగ్ ఆపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటుందని టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ అంటే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిందల్లా చేయడానికి ఈసీ ఆయన పెట్టిన హెరిటేజ్ సంస్థ, టీడీపీ కాదని విమర్శించారు.
చంద్రగిరిలో రీపోలింగ్ అంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీలోనే చంద్రబాబుకు సీటు లేదు కానీ ఇక ఢిల్లీలోని సీటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment