
సాక్షి, మహబూబ్‌నగర్ : గుజరాత్‌కు చెందిన అమిత్‌షాను హైదరాబాద్‌లో పోటీ చేయమని సవాల్ చేయటం కాదని.. అసదుద్దీన్‌కు దమ్ముంటే అంబర్ పేట్‌లో తనపై పోటీకి సిద్దపడాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ మీటింగ్ ద్వారా తమ ఐదు స్థానాలు నిలుపుకుంటామా? లేదా? ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తామా అన్నది తెలంగాణ ప్రజలకు చెబుతామని అన్నారు. ఈ మీటింగ్ ద్వారా తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని పేర్కొన్నారు.
ఏ పార్టీతో పొత్తు లేకుండా 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా బరిలో నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక త్వరలోనే చేపడతామని చెప్పారు. కాంగ్రెస్- టీడీపీ పొత్తు అనైతికమని పేర్కొన్నారు. తెలంగాణలో లేని టీడీపీ ఉనికిని చాటుకునేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటోందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment