హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. గెలవబోతున్నాం అని చింతకమడకలో ఓటు వేసిన అనంతరం కేసీఆర్ స్టేట్‌మెంట్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కావాలనే ఆవిధంగా మాట్లాడారని వ్యాక్యానించారు. ముఖ్యమంత్రిపై కచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాక్యానించారు.
రిజర్వేషన్లపై కేంద్రం అడ్డుపడుతోందని కేసీఆర్ చెప్పారు.. మరి ఇప్పుడు వచ్చిన తీర్పుపై ఏమంటారని ప్రశ్నించారు. ముషీరాబాద్, అంబర్‌పేట్లో రౌడీలు హల్‌చల్ చేశారు... ఈ విషయం ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బురఖా ధరించే ముస్లిం మహిళల ఏరియాలో బురఖా ముసుగులో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని, ఈ విషయం తెలిసీ కూడా మహిళా కానిస్టేబుళ్లను ఎందుకు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్‌పై చర్య తీసుకోండి: నల్లు
Published Fri, Dec 7 2018 3:23 PM | Last Updated on Fri, Dec 7 2018 8:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment