nallu indra sena reddy
-
కేసీఆర్‌పై చర్య తీసుకోండి: నల్లు
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనా రెడ్డి ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. గెలవబోతున్నాం అని చింతకమడకలో ఓటు వేసిన అనంతరం కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కావాలనే ఆవిధంగా మాట్లాడారని వ్యాక్యానించారు. ముఖ్యమంత్రిపై కచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాక్యానించారు. రిజర్వేషన్లపై కేంద్రం అడ్డుపడుతోందని కేసీఆర్ చెప్పారు.. మరి ఇప్పుడు వచ్చిన తీర్పుపై ఏమంటారని ప్రశ్నించారు. ముషీరాబాద్, అంబర్‌పేట్‌లో రౌడీలు హల్చల్ చేశారు... ఈ విషయం ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బురఖా ధరించే ముస్లిం మహిళల ఏరియాలో బురఖా ముసుగులో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని, ఈ విషయం తెలిసీ కూడా మహిళా కానిస్టేబుళ్లను ఎందుకు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. -
కమల దళపతి ఎవరు?
రాష్ట్ర అధ్యక్షుడి కోసం బీజేపీ కసరత్తు ♦ పార్టీకి జవసత్వాలు కలిగించే నేత కోసం వెతుకులాట ♦ బరిలో యెండల, ఇంద్రసేనారెడ్డి, రామచందర్‌రావు ♦ విముఖత చూపిన మురళీధర్‌రావు, లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియామకంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలకు ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. ఆ వెంటనే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడంపై అంతర్గత చర్చలకు ఉపక్రమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్‌రెడ్డి వరుసగా రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ రాష్ట్ర ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే సత్తా కలిగిన నాయకుడెవరనే దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ముఖ్య విషయాల్లో కీలక పాత్ర పోషించే సం ఘ్ పరివార్ యోచన ఏమిటన్నదానిపై పార్టీ నేతలు అంచనాకు రాలేకపోతున్నారు. బీజేపీ విస్తరణకు రాష్ట్రంలో చాలా అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకుని పార్టీకి జవసత్వాలు కలిగించే నాయకుడి ఎంపికకు అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మురళీధర్‌రావు, లక్ష్మణ్ విముఖత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జాతీయ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న పి.మురళీధర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. కానీ జాతీయ స్థాయిలోనే బాధ్యతలు నిర్వహిస్తానని, రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని ఆయన ఇప్పటికే తేల్చినట్లుగా సమాచారం. పార్టీలో సీనియర్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ పేరు కూడా చర్చకు వచ్చింది. శాసనసభాపక్షానికి నాయకుడిగా ఉంటూ పార్టీ అధ్యక్ష పదవిని కోరుకోవడం మంచిది కాదని, శాసనసభాపక్షనేతగానే కొనసాగుతానని లక్ష్మణ్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్త వారికే.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడం కోసం పార్టీలో వ్యక్తిగతంగా గ్రూపులు, వివాదాలు లేకుండా విస్తృత దృక్పథంతో పనిచేయగలిగే వారికోసం జాతీయ నేతలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటిదాకా పనిచేసినవారు కాకుండా కొత్త నేతకే పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నవారిలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలోనూ రెండోసారి గెలిచారు. పార్టీకి, సంఘ్ పరివార్‌కు విధేయంగా పనిచేస్తున్నారు. ఆయన బీసీ కావడం అదనపు అర్హత కూడా. కానీ ఆయన పార్టీ శాసనసభాపక్షనేత లక్ష్మణ్ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో అధ్యక్ష పదవిని ఇస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో సీనియర్ అయిన ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు కూడా పోటీలో ఉన్నారు. పార్టీలో ఎవరితోనూ వివాదాల్లేకుండా, జాతీయస్థాయిలో ప్రముఖులతో సంబంధాలున్న రామచందర్‌రావు అభ్యర్థిత్వానికి సంఘ్‌పరివార్ కూడా సుముఖంగానే ఉండొచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో బలమైన సామాజికవర్గం నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి పేరు కూడా చర్చలో ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో కఠినవైఖరి వంటి సానుకూల అంశాలు ఆయనకు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారం ఉన్నందున నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఇంద్రసేనారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు పార్టీ సీనియర్లు బి.రాజేశ్వర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. -
నల్లు ఇంద్రసేనారెడ్డికి మాతృవియోగం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అగ్రనాయకుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి మాతృమూర్తి నల్లు హనుమాయమ్మ(90) ఆదివారం తన స్వగృహంలో మృతిచెందారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హనుమాయమ్మ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
కేసీఆర్ అబద్ధాలకోరు.. : ఇంద్రసేనారెడ్డి
బీజేపీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అబద్దాలకోరు అని, పూటకోమాట మాట్లాడే ఆయన బీజేపీని విలన్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయడం సాధ్యం కాదని గమనించి.. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న కేసీఆర్.. బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేయించడం సరికాదన్నారు. 1956నాటి తెలంగాణ కావాలని బహిరంగ సభల్లో ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా, పార్లమెం టులో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ నోరెం దుకు మెదపలేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నాడు అన్ని పార్టీలు సమర్థించాయని అన్నారు. ఇంకా హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనకు అడ్డుపడింది బీజేపీయేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను కేసీఆర్ మానుకుంటే మంచిదన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తమ పార్టీని విమర్శించే హక్కులేదని నల్లు అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ భాగస్వామ్య ప్రభుత్వ హయాంలోనే పోలవరంపై 111 జీవో విడుదలైన విషయాన్ని హరీశ్ మరిచిపోతే గుర్తు చేసుకోవాలని సూచించా రు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మరో దఫా ఉంటుందని, అప్పుడు పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయక అవకాశం రావచ్చని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తమ పార్టీ అన్నివిధాలా సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1, 2 తేదీల్లో పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునిల్ తెలిపారు. సమావేశంలో నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, గందె నవీన్, మల్లారెడ్డి, లక్ష్మన్‌నాయక్, పుప్పాల రాజేందర్, బాకం హరిశంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దార్ పటేల్ సేవలు చిరస్మరణీయం: నల్లు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం ఆయన పటేల్ విగ్రహ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్థానాల విలీనానికి పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. రైతు నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్లో నర్మదా నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పటేల్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేయాలని మోడీ నిర్ణయించారని, ఇందుకోసం దేశంలోని ఐదు లక్షల మంది సర్పంచ్‌లకు స్వయంగా ఉత్తరాలు రాస్తున్నారని నల్లు తెలిపారు. దేశంలో అన్ని స్కూళ్లలో వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో విజేతలకు మోడీ పంపించిన బహుమతులను అందజేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజులపాటు ఈ రథంతో పర్యటిస్తామన్నారు.