
నల్లు ఇంద్రసేనారెడ్డికి మాతృవియోగం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అగ్రనాయకుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి మాతృమూర్తి నల్లు హనుమాయమ్మ(90) ఆదివారం తన స్వగృహంలో మృతిచెందారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హనుమాయమ్మ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.