బేతంచెర్ల: అధికార పార్టీ అయితే బంద్ చేయవచ్చు..అదే ప్రతిపక్ష పార్టీలు చేయకూడదా అని పీఏసీ చైర్మన్ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణంలో మంగళవారం నిర్వహించిన బంద్‌లో బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఏపీ ప్రజలకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడుకొని నాల్గు సంవత్సరాలు చక్కగా సర్దుకున్నారు. లక్షణంగా మీకు కావల్సినంత అవినితీ చేసుకున్నారు.
ఇంత అవినీతి జరిగినా కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యహరించింది. సీఎం హోదాలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ మంచిదని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లికి, వెంకయ్య నాయుడుకు సన్మానం చేశారు. ఢిల్లీ వెల్లిన ప్రతిసారీ శాలువాలు కప్పి, స్వీటు ప్యాకెట్లు పంచడం, రాష్ట్ర ప్రజలకు మాత్రం మన్నుపెట్టిన మాటవాస్తవం కాదా’’ అన్నారు. బుగ్గన ప్రసంగిస్తుండగానే పోలీసులు అరెస్టు చేయడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, విద్యార్థులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బుగ్గనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కార్యకర్తల అడ్డు తొలగించుకొని బుగ్గనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రతిపక్ష పార్టీ బంద్ చేయకూడదా?
Published Wed, Jul 25 2018 4:16 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment