సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని చంద్రబాబు నాయుడే అంగీకరించారని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం పార్టీ కార్యకర్తలకే దక్కుతుందన్నారు. బీజేపీ ఓడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది కలలు కన్నారని, కానీ ఓటర్లు వారి కలలపై నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ ఎంతో సహాయం చేసినా.. చంద్రబాబు నాయుడు తన సొంత మీడియా ద్వారా ఏమీ చేయలేదని ప్రచారం చేయించారని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ అని చెబుతారు కానీ బీజేపీలో మోదీ తర్వాత ఎవరూ ఉండరు అని అన్నారు. మోదీ ఆధ్వర్యంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పురేందేశ్వరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment