సాక్షి, కర్నూలు/అనంతపురం: కర్నూలు జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనబరచిన సవతి ప్రేమ బట్టబయలైంది. జిల్లాపై తాను వివక్ష చూపినట్టు చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలనుగానూ.. 11 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసకున్న విషయం తెలిసిందే. దీనిని మనసులో పెట్టుకున్న చంద్రబాబు జిల్లాపై విద్వేషాన్ని ప్రదర్శించారు. ఈ విషయాన్ని మంగళవారం అనంతపురంలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు అంగీకరించారు. ఆ సభలో చంద్రబాబు ట్లాడుతూ.. ‘కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి పనులు చేయలేదు. కర్నూలు జిల్లా ప్రజలు టీడీపీని తిరస్కరించినందునా.. జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా పట్టించుకోలేదని’ని అన్నారు.
కాగా, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కర్నూలు జిల్లాపై వివక్ష చూపెడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి మూడు సీట్లు వచ్చినందకే చంద్రబాబు కర్నూలును పట్టించుకోవడం లేదని సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్న సంగతి విదితమే. తాజాగా స్వయంగా ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంగీకరించి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.(బాబూ.. పరాజయం తప్పదని అశరీరవాణి ఘోషిస్తోందా?)
చంద్రబాబు వ్యాఖ్యలతోని ఆయన నైజం మరోసారి బయట పడిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో అందరిని సమానంగా చూడాల్సిన వ్యక్తి జిల్లా అభివృద్ధి విషయంలో ఈ విధంగా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాకు తాను ఏదో గొప్ప పని చేసినట్టు చెప్పకున్న చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపై సవతి ప్రేమ కనబరిచిన చంద్రబాబు.. రేపు ఏ విధంగా ఓట్లు అడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment