సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ టీడీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని ఉద్యోగుల పాలిట శాపంగా మరింది. ఓట్ల పథకాల కోసం డబ్బు మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వం లక్షకు పైగా ఉద్యోగుల కుటుంబాలను పస్తులు ఉండేలా చేస్తోంది. 1900 కోట్ల రూపాయల మేర జీతాలను ప్రభుత్వం చెల్లించదు. ఆ డబ్బులన్నీ చంద్రబాబు ప్రభుత్వం ఓట్లకోసం మళ్లించింది. జీతాలు పొందనివారిలో ఎయిడెడ్ పాఠశాల టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అన్ని శాఖల్లోని జౌట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు అందడం లేదు. విద్యాశాఖలో సిబ్బందికి ప్రభుత్వం 3 నెలలకు పైగా జీతాలు చెల్లించలేదు. వేల మంది రెగ్యూలర్ ఉద్యోగులకు కూడా జీతాలు అందని పరిస్థితి నెలకొంది.
ఎన్నికల నేపథ్యంలో హడావుడి నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఏపీ ప్రభుత్వం భారీ ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. ఏప్రిల్‌లోనే 8 వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ కావడంపై అధికారులు విస్తుపోతున్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 35వేల కోట్ల బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం డబ్బులన్నీ ఎన్నికల పథకాలకు మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment