సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనమే కలుగుతుందని, ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో చిన్నారెడ్డి, మరో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడారు. నాగం జనార్దన్‌రెడ్డి జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనూ ప్రభావం చూపించే నాయకుడని చిన్నారెడ్డి అన్నారు. నాగం లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానించాల్సిందేనన్నారు.
జైపాల్‌రెడ్డి, నాగంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు పనిచేయాలని కోరారు. వనపర్తికి చెందిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన కంటే రావుల బలమైన అభ్యర్థి అని భావిస్తే వనపర్తి సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ నాగం చేరికను వ్యతిరేకించడంలేదని వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment