
సాక్షి, ఖమ్మం: సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మంగళవారం మధిరలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే..వారిని డిస్మిస్ చేసి ఆర్టీసీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 48వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను డిస్మిస్ చేయడానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ చర్యలు ఆర్టీసీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.