
సాక్షి, అమరావతి: హామీల అమలు కోసం పార్లమెంట్‌లో శాంతియుతంగా పోరాడాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రత్యేక హోదాను హక్కుగా ప్రజలు భావిస్తున్నారని.. వారి మనోభావాలకు అనుగుణంగా నిరసన తెలపాలన్నారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎంపీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేది లేదని కేంద్రం పేర్కొనడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆవేదన ఉందని.. ఇప్పుడు వారిని మరింత రెచ్చగొట్టేలా ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ప్రజల సెంటిమెంట్ చూసి డబ్బులు ఇవ్వలేమని అరుణ్‌జైట్లీ అంటున్నారని.. కానీ గతంలో ఇలాగే సెంటిమెంట్‌ను అడ్డంపెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment