
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంపత్‌కుమార్
రాజోళి (అలంపూర్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడితో పని చేస్తుందని.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని.. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. శాంతినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నడిగడ్డను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అలంపూర్‌లోని ఆయకట్టుకు నీరందించి, అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నడిగడ్డ పర్యటనలో భాగంగా తుమ్మిళ్లలో కనీసం ప్రజలతో మాట్లాడకపోవడం దారుణమన్నారు. గద్వాలలో జరిగిన బహిరంగ సభలో తమ పార్టీకి చెందిన ఒక నాయకుడిని ఎత్తిచూపి, డీకే అరుణను తగ్గించి చూపే ప్రయత్నం చేశారని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నిజంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు సమావేశం కాలేదని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, జీఓలు కాని, ప్రస్తుతం తాలూకాకు ఏమీ చేస్తున్నామో ఎందుకు ప్రస్థావించలేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ప్రధాన నాయకులంతా గతంలో ఆర్డీఎస్ పరిరక్షణ సమితిలో ఉన్న తాను దీక్ష చేయగా.. సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించేది కేవలం సంపత్‌కుమారేనని అన్నారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరి అవకాశవాదులుగా మారి అడ్డగోలుగా వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు జగన్‌గౌడ్, నర్సింహారెడ్డి, పచ్చర్ల వీరేష్, రామకృష్ణారెడ్డి, షేక్షావళి, మద్దిలేటి, ప్రకాష్‌గౌడ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment