సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. తాండూరు, సంగారెడ్డి, మేడ్చల్, గోషామహల్‌లో జరిగే బహిరంగ సభల్లో ఆదిత్యనాథ్ ప్రసంగించనున్నారు. అలాగే నారాయణ్‌పేట్, కల్వకుర్తి, కామారెడ్డి, మల్కాజిగిరి బహిరంగ సభల్లో అమిత్‌షా పాల్గొననున్నారు. ఉప్పల్, కొల్లాపూర్, సూర్యాపేట్, సికింద్రాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలకు నితిన్‌గడ్కరీ హాజరుకానున్నారు. అలాగే డోర్నకల్, దేవరకొండ సభల్లో కేంద్ర మంత్రి జువ్వల్ ఓరం, యాకత్‌పురా సభలో పురుషోత్తం రూపాల పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment