సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై బుధవారం కూడా రాజ్యసభలో దుమారం కొనసాగింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మనోహ్మన్ పాకిస్థాన్ నేతలతో కలిసి కుట్ర పన్నారంటూ ప్రధాని చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ మోదీ క్షమాపణ చెప్పాలంటూ మూడు రోజులుగా సభలో పట్టుబడుతోంది.
ఈ క్రమంలో బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తారు. సభలో మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చిచెప్పింది. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment