
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అవిశ్వాసం ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజా పార్లమెంట్‌లో చంద్రబాబు, కేంద్రాన్ని ఎండగడతామన్నారు. ప్రజా క్షేత్రంలో ఎవరు తప్పించుకోలేరని.. ప్రజలు తిరగబడతారనే భయంతోనే టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. నాలుగేళ్లు హోదాపై చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని బాబురావు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment