
సాక్షి, నర్సీపట్నం: పోలవరం ప్రాజెక్టుపై రాద్ధాంతం చేయటం సరికాదని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృతి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ అసలు పని వదిలేసి.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై రాద్ధాతం చేస్తోందని మండిపడ్డారు.
డూప్లికేట్ నాయకురాలంటూ తనపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తనను అవమానిస్తే ఎన్టీఆర్, బసవతారకంల పెంపకాన్ని అవమానించినట్లేనని చెప్పారు.