
కాశీబుగ్గ : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన విషయాల్లో తప్పులు కేం ద్రంపై నెట్టేస్తోందని కేం ద్ర మాజీ మంత్రి, బీజేపీ కేంద్ర మహిళా మోర్ఛా అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. కాశీబుగ్గలో బీజేపీ నియోజకవర్గ బూత్‌కమిటీ సమావేశానికి శుక్రవారం ఆమె హాజరై మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ షయంలో ఒడిశా అభ్యంతరాలు అడ్డుగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల్లో 80 తం కేంద్రంఇస్తున్న నిధులని, కానీ ఈ పథకాలు అందించడం లేదనే ఆరోపణ తమ వరకూ వచ్చిందని తెలిపారు. మిత్రపక్షంపై ఇలాంటి వైఖరి కొనసాగితే తమ సామర్థ్యాన్ని బట్టి అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామన్నారు.