సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. గొల్లల మామిడాడలో సాయంత్రం బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
212వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
Published Sat, Jul 14 2018 8:58 AM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment