bikkavolu
-
బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి
సాక్షి, బిక్కవోలు (తూర్పుగోదావరి): చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వినాయక చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ హైస్కూలును ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రధ్దీగా ఉంటుంది. 1100 సంవత్సరాల చర్రిత కలిగిన ప్రాచీన ఆలయమిది. ఇక్కడ శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది. అప్పటి రాజులు ప్రత్యేక పూజలు చేసి, పనులు ప్రారంభిస్తే అనుకున్నట్టుగా జరిగేవని ప్రతీతి. ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తులు.. స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెప్పుకుంటారు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన స్వామి వారి విగ్రహం కాలక్రమేణా భుస్థాపితమైంది. అనంతరం 19వ శతాబ్దంలో ఈ విగ్రహం పంట పొలాల్లో బహిర్గతమైంది. స్వామి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భక్తులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడే మందిరం నిర్మించి, పూజలు ప్రారంభించారు. చవితి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు వినాయక చవితి సందర్భంగా శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో బుధవారం నుంచి సెప్టెంబర్ 9వ తేది వరకూ నవరాత్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.52 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామి వారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.12 గంటలకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేస్తారు. పదో తేదీన మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ తొమ్మిది రోజులూ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. స్వామి వారి ప్రత్యేకతలు బిక్కవోలు శ్రీలక్ష్మీగణపతి స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున ఉంటుంది. భారీ కాయంతో ఉన్న స్వామి వారి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నాగాభరణం, నాగ మొలతాడు, నాగ యజ్ఞోపవీతం, బిళ్లకట్టు పంచెతో సుఖాశీనులైన స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా సుప్రసిద్ధుడు. అంగరంగ వైభవంగా.. గడచిన రెండేళ్లూ కోవిడ్ కారణంగా ఉత్సవాలు సాదాసీదాగా జరిగాయి. ఈ ఏడాది పరిస్థితులు కుదుట పడటంతో చవితి ఉత్సవాలను భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు చవితి మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఏర్పాటు చేశాం. – తమ్మిరెడ్డి నాగ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ -
పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..
సాక్షి, తూర్పుగోదావరి(బిక్కవోలు): ఓ బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై బుజ్జిబాబు శనివారం తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొమరిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై రెండు రోజుల క్రితం అతడి చిన్నాన్నలు మందపల్లి అప్పన్న, మందపల్లి సతీష్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాలుడి తొడలు, మర్మాంగంపై వాతలు పెట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. బాలుడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అతడు కోరుకొండలోని తన పెద్దనాన్న ఇంటి వద్ద ఉండేవాడు. ఇటీవల తండ్రి చనిపోవడంతో బాలుడు స్వగ్రామం కొమరిపాలెం వచ్చాడు. వరుసకు పిన్ని అయిన మహిళకు, బాలుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలియడంతో ఆమె భర్త అప్పన్న, సతీష్ కలిసి బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆ బాలుడు ఈ విషయం పెద్దమ్మకు చెప్పగా, పెద్దనాన్న వెళ్లి దాడికి పాల్పడిన వ్యక్తులను నిలదీశాడు. అతడిపై కూడా వారు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం అనపర్తి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. అప్పన్న, సతీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..) -
ఏమి'టీ' మోసం
బిక్కవోలు: గుట్టు చప్పుడు కాకుండా నాలుగేళ్లుగా నకిలీ టీపొడి తయారీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఓ కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని ఆర్ఎస్పేటలో మూతబడిన రైస్ మిల్లులో ఈ పొడి తయారు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్‌సేఫ్టీ అసిస్టెంట్ అధికారి శ్రీనివాస్, ఎస్ఐ పి.వాసు శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. అనిల్ శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి అరుణ్ ఎంటర్‌ప్రైజస్ పేరుతో వివిధ ప్రాంతాలకు నకిలీ టీపొడిని ఎగుమతి చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రంలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు వద్ద వివరాలు రాబట్టారు. టీపొడి తయారీకీ శుద్ధమట్టి, ఎర్రమట్టి, నిర్మాపొడరు, జీడీపిక్కలపైతొక్క పొడి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 135 బస్తాల జీడి పిక్క పౌడరు, 33బస్తాల నకిలీటీ పొడి, 22 బస్తాల నిర్మా వాషింగ్ పౌడర్‌తో పాటు ఎర్రమట్టి, శుద్ధమట్టిని సీజ్ చేశారు. కాగా, ఉన్నతాధికారులకు నివేదికను అందించి తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. దాడిలో తహసీల్దార్ కె.వెంకటమాధవరావు, డీటీ కృష్ణ, ఫుడ్‌సేప్టీ అధికారులు పాల్గొన్నారు. -
అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్
తూర్పు గోదావరి : జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. -
కొడుకును చంపిన తండ్రి
చుట్ట ఇవ్వలేదన్న కోపంతో బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ తండ్రి క్షణికావేశంలో తన తయుడుని హతమార్చగా.., కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో మరో తండ్రి కుమారుడి వేధింపులు భరించలేక అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో సంచలనమయ్యాయి. సాక్షి బిక్కవోలు (తూర్పుగోదావరి): ఓ చుట్ట కోసం కొడుకుతో తగాదా పెట్టుకున్న తండ్రి క్షణికావేశంలో కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిన ఘటన బిక్కవోలు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టిలో పని చేయడానికి నాలుగు నెలల కిందట జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పాక చంటి, అతని రెండో భార్య అర్జమ్మ వచ్చారు. గురువారం రాత్రి తండ్రి చుట్ట ఇమ్మని కొడుకుని అడిగితే ఇంట్లో బియ్యం పెట్టె మీద ఉంది తీసుకోమన్నాడు. అది కనిపించలేదు. దీంతో కొడుకు మీద కొప్పడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తండ్రి కోపంతో కర్ర తీసుకువచ్చి కొడుకు నాగు (24)తలపై కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఉదయం అనపర్తి సీఐ ఎన్వీ భాస్కరరావు, ఎస్త్సె పి.వాసు, వీఆర్వో రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని ఎస్త్సె పి.వాసు తెలిపారు. కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం కిర్లంపూడి (జగ్గంపేట): కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామంలో జరిగింది. కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు కథనం ప్రకారం.. ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన నక్కా పెదఅప్పారావుకి నలుగురు కుమారులు ఉన్నారు. ఇతడు ప్రతినెలా వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్నాడు. ప్రతినెలా పెద్ద కొడుకు నక్కా పెద సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు తండ్రి వద్ద నుంచి బలవంతంగా పింఛను డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ నెలలో అలా చేయడంతో పెదఅప్పారావు కొడుకు సత్తిబాబుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖంపై బలమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగో కుమారుడు నక్కా శివ ఫిర్యాదు మేరకు తండ్రి నక్కా పెదఅప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.అప్పలరాజు తెలిపారు. -
కలకలం రేపిన హెచ్ఎం కిడ్నాప్
-
కొంకుదురులో అదృశ్యం.. కాకినాడలో ప్రత్యక్షం
సాక్షి, బిక్కవోలు (తూర్పుగోదావరి) : మండలంలోని కొంకుదురు, కే.సావరం గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి ఆలియాస్ వార్త శ్రీను మాయమై ఐదు గంటల అనంతరం కాకినాడ రెండో పట్టణ పోలీస్టేషన్లో ప్రత్యక్షమైన ఘటన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ వార్త బిక్కవోలు, పెదపూడి మండలాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తొస్సిపూడి నుంచి కొంకుదురు మీదుగా స్వగ్రామం మామిడాడ బయలుదేరాడు. కొంకుదురు దాటిన తరువాత సావరం వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరెడ్డి కారును వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారు ఆపి కిందకు దిగిన అతడిని దుండగులు దాడి చేసి తమ కారులోకి బలవంతంగా తీసుకుని పోయారని కుమారుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీనికంతటికి శ్రీనివాసరెడ్డి గతంలో ఫైనాన్స్ వ్యాపారికి ఇవ్వవలసిన నగదు బకాయే కారణమని పలు అనుమానాలు ఉన్నాయి. ఈ లోపు శ్రీనివాసరెడ్డి కాకినాడ పోలీస్టేషన్‌కు చేరుకుని తాను కిడ్నాప్‌కు గురికాలేదని వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు తెలపడంతో కథ సుఖాంతమైంది.. నేను కిడ్నాప్ కాలేదు ఐదు గంటల పాటు ఉత్కంఠ రేపిన శ్రీనివాసరెడ్డి కిడ్నాప్ వ్యవహారం ఆయన వాగ్మూంలంతో సద్దుమణిగింది. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా కారుకు ప్రమాదం జరిగిందని, దీంతో హుటాహుటిన కాకినాడ ఆసుపత్రికి వెళ్లగా ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో కిడ్నాపయ్యానని అందరు ఆందోళన చెందారని, తాను పోలీసుల వద్ద క్షేమంగానే ఉన్నానని శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు ఎస్సై వాసు తెలిపారు. -
వైఎస్ జగన్ పాదయాత్ర 212వ రోజు ప్రారంభం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను జననేత ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. గొల్లల మామిడాడలో సాయంత్రం బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
అదృష్టమూ ఉండాలి
సినీ నటుడు గౌతంరాజు బిక్కవోలు : సినీ పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టమూ కలసిరావాలని సినీ నటుడు గౌతంరాజు చెప్పారు. మంగళవారం ఆయన బిక్కవోలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 350కి పైగా సినిమాల్లో నటించినట్టు పేర్కొన్నారు. ప్రేమకు వేళాయెరా, ఘరానా మొగుడు, అమ్మ, నాన్న.. తమిళ అమ్మాయి, దేశముదురు, బుజ్జిగాడు తదితర చిత్రాల్లో బాగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఇంచుమించు పరిశ్రమలో ఉన్న దర్శకులందరి వద్ద పనిచేశానన్నారు. వంశీ, రాజమౌళీ దర్శకత్వం అంటే తనకు ఇష్టమని, ఎప్పటికైనా వారితో నటించాలని ఉందని చెప్పారు. తన కుమారుడు కృష్ణంరాజు(కృష్ణ)ను తన వారసుడిగా సినీరంగానికి త్వరలో పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. బీటెక్ చదువుకున్న కృష్ణ స్వయంకృషితో సినీరంగ ప్రవేశం చేస్తున్నట్టు వివరించారు. తోపుగాడు చిత్రంలో తన కుమారుడితో కలసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తాను అల్లరి నరేష్, సుశాంత్‌తో పేరు పెట్టని సినిమాలతో పాటు హీరో శ్రీకాంత్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు. కుతుకులూరులో ఉన్న ఇమేజ్ ఛానల్లో ‘మా ఇంటికి రండి’ అనే కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. -
లారీ, బస్సు ఢీ:10 మందికి గాయాలు
బిక్కవోలు : విజయనగరం నుంచి రాజమండ్రి పుష్కరాలకు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని, బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు డ్రైవర్లతో పాటు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
బిక్కవోలులో భారీ చోరీ
రాజమండ్రి: పెళ్లికి వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుల్ల చేసిన సంఘటన రాజమండ్రి పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం పొంకుదురు గ్రామానికి చెందిన పి.వీర్రాఘవులు కుటుంబం బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇదే అదునుగా దొంగలు తెగబడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం పెళ్లి నుంచి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవింద్రనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.