అదృష్టమూ ఉండాలి | actor gowtham raju interview | Sakshi
Sakshi News home page

అదృష్టమూ ఉండాలి

Published Wed, May 18 2016 10:40 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

అదృష్టమూ ఉండాలి - Sakshi

అదృష్టమూ ఉండాలి

సినీ నటుడు గౌతంరాజు
 బిక్కవోలు : సినీ పరిశ్రమలో ప్రతిభతో పాటు అదృష్టమూ కలసిరావాలని సినీ నటుడు గౌతంరాజు చెప్పారు. మంగళవారం ఆయన బిక్కవోలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 350కి పైగా సినిమాల్లో నటించినట్టు పేర్కొన్నారు. ప్రేమకు వేళాయెరా, ఘరానా మొగుడు, అమ్మ, నాన్న.. తమిళ అమ్మాయి, దేశముదురు, బుజ్జిగాడు తదితర  చిత్రాల్లో బాగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఇంచుమించు పరిశ్రమలో ఉన్న దర్శకులందరి వద్ద పనిచేశానన్నారు.
 
 వంశీ, రాజమౌళీ దర్శకత్వం అంటే తనకు ఇష్టమని, ఎప్పటికైనా వారితో నటించాలని ఉందని చెప్పారు. తన కుమారుడు కృష్ణంరాజు(కృష్ణ)ను తన వారసుడిగా సినీరంగానికి త్వరలో పరిచయం చేస్తున్నట్టు తెలిపారు. బీటెక్ చదువుకున్న కృష్ణ స్వయంకృషితో సినీరంగ ప్రవేశం చేస్తున్నట్టు వివరించారు. తోపుగాడు చిత్రంలో తన కుమారుడితో కలసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తాను అల్లరి నరేష్, సుశాంత్‌తో పేరు పెట్టని సినిమాలతో పాటు హీరో శ్రీకాంత్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు. కుతుకులూరులో ఉన్న ఇమేజ్ ఛానల్‌లో ‘మా ఇంటికి రండి’ అనే కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement