భువనేశ్వర్: మాజీ కేంద్ర మంత్రి, రూర్కెలా ఎమ్మెల్యే దిలీప్ రే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన మూడు పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం ఉదయం ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ప్రదీప్ అమత్‌న కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో గొప్ప మార్పు రాబోతుందని బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో నేను కూడా నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని భావించాను. చాలా కాలంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేను పరిష్కరిస్తానని అక్కడి ప్రజలు నమ్మారు. నా నియోజకర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతుగా ఎంతో కృషి చేశారు. కానీ, నేను అంచనాలను చేరుకోలేకపోయాను. అందుకే నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇది చాలా బాధతో కూడుకున్న నిర్ణయం. రూర్కెలాలో 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేద’ని దిలీప్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
దిలీప్ రాజీనామా స్పందించిన ఒడిశా బీజేపీ చీఫ్ బసంత్ పాండా మాట్లాడుతూ.. ఒక కొమ్మ పడిపోయినంతా మాత్రనా చెట్టుకు ఎటువంటి నష్టం లేదని అన్నారు. నష్టపోయిన చోటు నుంచే కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయని తెలిపారు. కాగా, రూర్కెలా ఇస్పాత్ జనరల్ హాస్పిటల్, బ్రహ్మణి నదిపై రెండో వంతెన నిర్మించకపోవడంపై దిలీప్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment