
సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు సినీ నటులు పోటీకి దిగనున్నారు. సినీ నటుడు విశాల్‌కు పోటీగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్ సిద్ధమయ్యారు. ఇక 13 ఏళ్ల అనంతరం డీఎంకేకు మద్దతివ్వాలని ఎండీఎంకే నేత వైగో ఆదివారం నిర్ణయించారు. దీనిని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్వాగతించారు. అన్నాడీఎంకే అభ్య ర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీ ఎంకే అమ్మ (రెబల్) గా టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేయాలని అమీర్ నిర్ణయించారు. ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్, విశాల్, అమీర్ సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment