సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. పుట్టపర్తి అసెంబ్లీ టికెట్ పల్లెకు ఇవ్వొదంటూ అసమ్మతి నేతలు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ రెస్కో చైర్మన్ రాజశేఖర్, మాజీ పుట్టపర్తి సగర పంచాయతి చైర్మన్ పీసీ గంగన్న, విద్యావేత్త పెదరసు సబ్రమణ్యల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పల్లె ఆదేశాలతోనే తమ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని అసమ్మతి నేతలు మండిపడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ పుట్టపర్తి అసెంబ్లీ టికెట్‌ను రఘునాథరెడ్డికి ప్రకటించొద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పల్లె అసమ్మతి వర్గాలు, అనుకూల వర్గాలు బాహా బాహీకి దిగారు. ‘పల్లె వద్దు పార్టీ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ అసమ్మతి నేతలు తమ నిరసనను తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment