సాక్షి, న్యూఢిల్లీ : ‘కుచ్ నయీ హోనా వాలా మైతో లండన్ చలా జావుంగా, మేరే బచ్చే జాకే అమెరికా మే పడేంగే! మేరా హిందుస్థాన్ సే కుచ్ దేనా, లేనా నహీ హై, మేరా పాస్ హజారో కరోడ్ రుపయ్ హై మైతో కబీ బీ చలా జావుంగా (జరిగేదేమీ లేదు. నేను లండన్ వెళ్లి పోతాను. మా పిల్లలు కూడా లండన్ వెళ్లి చదువుకుంటారు. భారత్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు) అని రాహుల్ గాంధీ ఈ మాటలు అన్నట్లు తెలియజేసే 11 సెకండ్ల వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. దీన్ని బీజేపీ సోషల్ మీడియా జాతీయ ఇంచార్జీ ప్రీతి గాంధీ మొదట ట్వీట్ చేశారు.
ఈ కారణంగానే భారతీయులకు మీరంటే ఇష్టం లేదనే వ్యాఖ్యానంతో ఇదే వీడియో క్లిప్పింగ్‌ను అకాలీ దళ్ ఎమ్మెల్యే మాంజిందర్ ఎస్ సిర్సా కూడా ట్వీట్ చేశారు. ‘ఇది గాంధీ కుటుంబం నిజ స్వరూపం, ప్రజలు తమ తండ్రి ఆస్తి అని వారు భావిస్తున్నారు. అతను లండన్ పోతానని, ఆయన పిల్లలు అమెరికా పోతారని చెబుతున్నారు. వారి మాత స్థలం పాకిస్తాన్ పోవడం మంచిది’ అన్న వ్యాఖ్యానంతో ఇదే వీడియో క్లిప్పింగ్ ఫేస్‌బుక్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. నిజంగా ఇందులో వాస్తవం ఉందా ? ఎంత అసహనం ఉన్నా రాహుల్ గాంధీ లండన్ వెళ్లిపోతానని ప్రకటిస్తారా ? అందులోను తన వద్ద వేల కోట్ల రూపాయలున్నాయని పరోక్షంగానైనా అంగీకరిస్తారా ? పెళ్లి పెటాకులే లేని రాహుల్ గాంధీ తన పిల్లలు అమెరికాలో చదువుకుంటారని అంటారా ? ఇలాంటి సందేహలాలు కలిగినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్‌లో ఎక్కడో లోపం ఉందనే విషయాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలోని లాథూర్‌లో అక్టోబర్ 13వ తేదీన రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని ఓ భాగం ఈ క్లిప్పింగ్. ఆ ప్రసంగంలో ఆయన ‘పరారీలో ఉన్న నేరస్థులు’గా ముద్ర పడిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. 14వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో వారు ప్రధాన నిందితులన్న విషయం తెల్సిందే. ఆ క్లిప్పింగ్ చివరలో ‘నాకు నరేంద్ర మోదీ లాంటి మిత్రులు ఉన్నారు. నాకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. ఇది భారత్‌లో కనిపించే వాస్తవం’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, ‘నాకు నరేంద్ర మోదీ లాంటి మిత్రులు ఉన్నారనడం, ఇది భారత్‌లో కనిపించే వాస్తవం’ అన్న పదాలను అసందర్భంగా ఎడిట్ చేసి రాహుల్ మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా వీడియో క్లిప్‌ను విడుదల చేశారు.
రాహుల్ గాంధీ లండన్ వెళ్లి పోతారా?!
Published Tue, Oct 15 2019 3:30 PM | Last Updated on Tue, Oct 15 2019 5:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment