జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా మొత్తం 200 నియోజకవర్గాల్లోనూ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్–ఓటు రశీదు యంత్రం)లను వినియోగిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా 51,796 పోలింగ్ బూత్‌లలో ఈ మెషీన్లను వాడతామని రావత్ చెప్పారు.
నకిలీ వీవీప్యాట్‌లను గుర్తించగలిగేలా ఎం3 రకం ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం ఒక్క పోలింగ్ బూత్‌ను అయినా పూర్తిగా మహిళా సిబ్బందే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో ఏదైనా అసాధారణ, అసాంఘిక చర్యలు జరిగినట్లు తెలియగానే ఛిVఐఎఐఔ యాప్ ద్వారా పౌరులు ఫిర్యాదుచేయవచ్చని రావత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment