
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్ప ఓటర్లు(17,33,667) ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య
జిల్లా పేరు | ఓటర్ల సంఖ్య |
శ్రీకాకుళం | 20,64,330 |
విజయనగరం | 17,33,667 |
విశాఖ పట్నం | 32,80,028 |
తూర్పు గోదావరి | 40,13,770 |
పశ్చిమ గోదావరి | 30,57,922 |
కృష్ణా | 33,03,592 |
గుంటూరు | 37,46,072 |
ప్రకాశం | 24,95,383 |
నెల్లూరు | 22,06,652 |
కడప | 20,56,660 |
కర్నూలు | 28,90,884 |
అనంతపురం | 30,58,909 |
చిత్తూరు | 30,25,222 |
Comments
Please login to add a commentAdd a comment