సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలను పునస్కరించుకొని ఎన్నికల కమిషన్ ఇంతవరకు నిర్వహించిన తనిఖీల్లో 3,370 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 935 కోట్ల విలువైన మొత్తం పట్టుబడడం గమనార్హం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో 303 కోట్ల రూపాయల నగడు పట్టుబడగా ఈసారి 812 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. దీన్నిబట్టి ఎన్నికలు రానురాను ఎంత ఖరీదైనవిగా మారుతున్నాయో తెలుస్తోంది.
రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్న ఆ కాస్త ఆంక్షలను ఎత్తివేయడంతో రాజకీయ పార్టీలకు నిధులు వచ్చి పడుతున్నాయి. పేరు, ఊరు లేకుండా ఆకాశరామన్న లాగా కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండులు తీసుకొని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చనే విధానాన్ని తీసుకరావడం వల్ల గత మార్చి, ఏప్రిల్ నెలల్లోనే 3,622 ఎలక్టోరల్ బాండులు అమ్ముడు పోయాయని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడయింది. వాటిలో సగానికిపైగా బాండులు కేంద్రంలో అధికారపక్షమైన బీజేపీకే వెళ్లాయి. వాటిని ఇంకా రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకోలేదని తెలుస్తోంది. ఆ డబ్బుకు కూడా ఈ ఎన్నికల్లోకి వచ్చి పడుంటే పట్టుబడిన విలువతో అది ఏడువేల కోట్ల రూపాయలకు చేరొకొని ఉండేది. పట్టుపడేది ఎప్పుడు కూడా అసలు ఖర్చులో 20 శాతానికి మించదని ఎన్నికల కమిషన్ వర్గాలు ఇదివరకే తేల్చి చెప్పాయి. ఈ లెక్కన రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం దాదాపు 17వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు లెక్క. ఏ కార్పొరేట్ సంస్థ కూడా సద్బుద్ధితో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదు. స్వప్రయోజనాల కోసమో, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికో ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని, నల్లడబ్బును నివారించేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోక పోవడం వల్ల ఇది పెరుగుతూనే ఉంది.
ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వర్గాలు తాము పట్టుకున్న నగదును కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ ప్రభుత్వం, ఎవరి దగ్గర పట్టుకున్నారో వారికే తిరిగి ఇచ్చేస్తుందట. 2014 ఎన్నికల సందర్భంగా పట్టుబడిన 303 కోట్ల రూపాయలను అలాగే తిరిగి ఇచ్చామని శుక్రవారం నాడు కేంద్రం వెల్లడించడంతో సుప్రీంకోర్టు అవాక్కయింది. ఇక వంద మంది డబ్బు సంచులతో పట్టుబడితే వారిలో నలుగురిపైనే కేసులు నమోదవుతున్నాయని కూడా తెలపడం మరింత ఆశ్చర్యం. పట్టుబడిన వారిని విచారించి శిక్షించేందుకు సరైన వ్యవస్థ లేక అలా చేస్తుందా? పట్టుబడిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారు ఉండడం వల్ల అలా జరుగుతుందా? ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వలతో సంప్రతింపులు జరపడం వల్ల సరైన శిక్ష విధించేలా ^è ర్యలు తీసుకోవాలని కూడా కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఎన్నికల్లో ఇప్పటి వరకు పట్టుబడ్డ నగదెంత?
Published Mon, May 13 2019 8:08 PM | Last Updated on Mon, May 13 2019 8:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment