విద్యార్థినులతో ముచ్చటిస్తున్న రాహుల్
చెన్నై: గత వారంలో చెన్నైలో విద్యార్థినులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జరిపిన చర్చా కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది. గత బుధవారం (మార్చి 13న) రాహుల్ గాంధీ చెన్నైలోని స్టెల్లా మెరీ వుమెన్స్ కాలేజీలో విద్యార్థినులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆ కాలేజీ రాహుల్ గాంధీతో చర్చా కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చిందంటూ తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అయితే, ఈ కార్యక్రమానికి ముందస్తుగా కాలేజీ అనుమతి తీసుకుందని జిల్లా ఎన్నికల అధికారి తమకు సమాచారం ఇచ్చారని, అయితే, ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను ఆదేశించామని, ఆయన ఏ రకమైన ప్రసంగం చేశారన్నది పరిశీలించాల్సి ఉందని తమిళనాడు ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రత సాహూ తెలిపారు. స్టెల్లా మెరీ కాలేజీలో విద్యార్థినులతో ముచ్చటించిన రాహుల్.. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం కోటా కల్పిస్తామంటూ పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment